- Advertisement -

దిగొచ్చిన టీటీడీ.. తెలంగాణ లేఖలకు అనుమతి!

- Advertisement -

తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుండి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో దిగొచ్చింది టీటీడీ. మార్చి 24వ తేదీ నుండి తెలంగాణా సిఫార్సు లేఖలకు తిరుమల శ్రీవారి దర్శనం కేటాయింపు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు లేఖలు స్వీకరించే విధానం అమల్లోకి రానుంది.

సోమ, మంగళవారాల్లో తెలంగాణ సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయించారు. ఏపీ ప్రజా ప్రతినిధులకు ఇకపై సోమవారం దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించడవు అని తెలిపారు. దానికి బదులుగా శనివారం నాడు ఆదివారం దర్శనం కొరకు లేఖలు స్వీకరించనుంది టీటీడీ.

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు బుధ,గురువారాల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటాయించారు. ప్రజాప్రతినిధి ఒకరికి ఒక సిఫార్సు లేఖ మాత్రమే 6 మందికి మించకుండా దర్శనం కేటాయించనుందిన్న టీటీడీ. సుదీర్ఘంగా చర్చించి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని సిబ్బందికి సహకరించాలని భక్తులను కోరుతుంది టీటీడీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -