తాడిపత్రిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ సమావేశాన్ని అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు యత్నించారు. జేసీ ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసుల చర్యలను వైసీపీ తప్పుబట్టారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను ఒకసారి గుర్తు చేసుకుంటూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం చేస్తున్నాం అని తెలిపారు కేతిరెడ్డి అర్చితారెడ్డి. ఎన్నికలప్పుడు కూటమి నాయకులు ఇంటింటికీ వచ్చి బాండ్ పేపర్లు ఇచ్చి అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పారు.
అధికారంలోకి వచ్చాక అవి నెరవేర్చకపోగా ప్రశ్నించిన వాళ్లపై దాడి చేస్తున్నారు…. పెద్దారెడ్డి కుటుంబాన్ని ఆదరిస్తూ వెంట నడుస్తున్న తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు, వైఎస్ఆర్ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు పెద్దారెడ్డి కోడలు అర్చితా రెడ్డి.
రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామో అందరికీ తెలుసు అన్నారు చిలకలూరిపేట వైసీపీ ఇంఛార్జ్ విడుదల రజిని. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశాడు… జగనన్న క్యాలెండర్ లో పండగలున్నట్టు నవరత్నాల పథకాలకు తేదీలు ప్రకటించి మరీ తొలి ఏడాదిలోనే 99% అమలు చేశారు… రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం కార్యకర్తల ప్రభుత్వం. కష్టపడిన నాయకుల ప్రభుత్వం అన్నారు.
