- Advertisement -
జనసేన నేత కిరణ్ రాయల్ కేసులో బిగ్ ట్విస్ట్. జనసేన నేత దినేష్ జైన్, హరిశంకర్, గనితో పాటు వైసీపీ నేత సురేశ్ తన ఫొటో, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలలో వైరల్ చేశారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు లక్ష్మీ రెడ్డి.
మార్ఫింగ్ చేసిన తన ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయాలని అనేకసార్లు కోరినా చేయలేదని లక్ష్మీ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కిరణ్ రాయల్ మాయమాటలతో తాను సర్వస్వం కోల్పోయానని, తన నుంచి తీసుకున్న రూ.1.20 కోట్లు, 25 సవర్ల బంగారం మాత్రమే తాను తిరిగి అడుగుతున్నానని గతంలో ఆరోపణలు చేశారు లక్ష్మీ రెడ్డి.
