- Advertisement -

ఏవోబీలో మరో ఎన్‌కౌంటర్‌..కీలక నేతలు హతం

- Advertisement -

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) మరియు మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతుండగా, మన్యం ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఒక్కొక్కరుగా మావోయిస్టుల బలగాలను మట్టుబెడుతున్నట్లు సమాచారం.

ఈ ఎన్‌కౌంటర్‌లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఏడుగురు మావోయిస్టు అగ్ర నాయకులు హతమైనట్లు అధికారులు ప్రకటించారు. మరణించిన వారిలో ఏవోబీ ఇన్‌ఛార్జి జోగారావు అలియాస్ టెక్ శంకర్, డివిజనల్ కమిటీ సభ్యురాలు జ్యోతి, సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు సురేష్ అలియాస్ రమేష్, జాగరగొండ ఏరియా మిలిషియా కమాండర్ లోకేష్ అలియాస్ గణేష్ తో పాటు శ్రీను, అనిత, షమ్మి ఉన్నట్లు గుర్తించారు.

కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత దేవ్ జీ కూడా ఉన్నట్లు సమాచారం అందింది. అయితే, దేవ్ జీ ఎన్‌కౌంటర్‌లో మరణించాడా లేక లొంగిపోయాడా అనే దానిపై పోలీసులు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ కీలక నేతల మరణం మావోయిస్టు పార్టీకి వ్యూహాత్మకంగా తీరని లోటుగా పరిగణించబడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -