- Advertisement -
2008లో జరిగిన 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడివి శేష్ ‘మేజర్’ సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా విడుదలై మూడేళ్లు గడిచిన నేపథ్యంలో, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులను అడివి శేష్ ముంబైలో కలిశారు.
ఈ సందర్భంగా, ముంబైలోని మేజర్ స్మారక చిహ్నం వద్ద ఆయన అమరుడికి నివాళులు అర్పించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26న (26/11 ఉగ్రదాడి జరిగిన రోజు) మేజర్ కుటుంబంతో గడపడం, వారిని పలకరించడం అడివి శేష్‌కు ఒక ఆనవాయితీగా మారింది.
దేశం కోసం ప్రాణాలర్పించిన మేజర్ సందీప్ త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని అడివి శేష్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
