- Advertisement -

రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా?

- Advertisement -

చంద్రబాబు పాలనలో రాష్ట్రం అన్ని విధాల నష్టపోయింది… అన్ని వర్గాల ప్రజలు బాబు చేతిలో మోసపోయారు. మమ్మల్ని రక్షించేవాళ్లే లేరా దేవుడా అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని మండిపడ్డారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. రాష్ట్రంలో పరిపాలన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ మోడ్‌లోకి వెళ్లిపోయింది. ‘హలో ఇండియా… ఏపీ వైపు ఒక్కసారి చూడండి’ అన్నట్టు పరిస్థితులు తయారయ్యాయి అని ఎద్దేవా చేశారు.

రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది అని గుర్తుచేశారు జగన్‌. తమ పాలనలో వ్యవసాయం పండుగలాగా ఉండేదని, కానీ చంద్రబాబు పాలనలో అది దండగలా మారిపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. రైతుల వద్దకు వెళ్లే పరిస్థితి కూడా ప్రస్తుత నాయకులకు లేదని, వెళితే రైతులు ప్రశ్నలు వేస్తారని, కోపంగా స్పందిస్తారని జగన్ వ్యాఖ్యానించారు.

ఆశ్చర్యం కలిగించే ప్రకటనలు, బుల్డోజింగ్ చర్యలు, గోబెల్స్‌ తరహా ప్రచారంలో నిమగ్నమయ్యారు అని ఆయన ఆరోపించారు. ఏపీలో వ్యవసాయంపై 42% జనాభా ఆధారపడింది. ఇంత పెద్ద రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మొంథా తుపాను వస్తుందని ముందే తెలిసినా సరైన చర్యలు తీసుకోలేదు. RTGS కార్యాలయంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురూ గొప్ప బిల్డప్ ఇచ్చారు. 15 లక్షల ఎకరాలకు నష్టం జరిగితే, 4 లక్షల ఎకరాలకే నష్టం అని చూపించారు. కానీ పరిహారం మాత్రం ఇవ్వలేదు అన్నారు.

కూటమి ప్రభుత్వం 19 నెలల పాలనలో 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, ఇన్‌పుట్ సబ్సిడీలు ఇవ్వలేదని, మొత్తం 1100 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించలేదని ఆయన అన్నారు. పంటల బీమా పూర్తిగా నిలిపివేసి ప్రీమియం రైతులే చెల్లించాలని చెప్పడంతో, రైతులు నష్టపోయారని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో 84 లక్షల ఎకరాల సాగులో… కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. పంటలకు గిట్టుబాటు ధర లేదు. అరటిపండ్లు కిలో అర్థ రూపాయికే అమ్ముకుంటున్నారు. దిత్వా తుపాను ముందు నుంచే తెలిసినా ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేయలేదు. మా హయాంలో అనంతపురం నుంచి ఢిల్లీ వరకూ అరటి రైలు నడిపాం అని జ‌గన్ గుర్తు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -