- Advertisement -

రాహుల్‌..56 ఏళ్ల యువకుడా?

- Advertisement -

హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సాధించిన విజయవంతమైన రాకెట్ ప్రయోగాన్ని అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…..కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశారు. ఈ సంస్థలోని యువ బృందం సాధించిన ఘనతను కొనియాడిన ప్రధాని.. ఈ విజయం సగటు వయసు కేవలం 28 ఏళ్లు ఉన్న యువ ఆవిష్కర్తలదని ఎవరో 56 ఏళ్ల యువకుడిది కాదు అంటూ వ్యాఖ్యానించారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు మీడియాను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా సైన్స్, ఆవిష్కరణలు మరియు అంతరిక్ష సాంకేతికత రంగాలలో భారతదేశం సాధిస్తున్న విజయాలను ప్రశంసించడంతో పాటు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత కీలకపాత్ర పోషిస్తుందన్నారు.

స్కైరూట్ ఏరోస్పేస్ సాధించిన తాజా విజయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ విజయం భారతదేశ యువతరం యొక్క శక్తికి ఆకాంక్షలకు ప్రతిరూపమని పీఎం మోదీ అన్నారు. భారతదేశ యువత అంతరిక్షంలోకి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ‘స్కైరూట్’ స్టార్టప్‌లో పనిచేస్తున్న మొత్తం బృందం సగటు వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమేనని నాకు చెప్పారు. ఇలాంటి యువకులే ఈ ఘనత సాధించారు. నేను ఏ 56 ఏళ్ల యువకుడి గురించో మాట్లాడటం లేదు అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసినదేనని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల గురించి ప్రధాని మాట్లాడుతూ.. సభా కార్యకలాపాలు నిర్మాణాత్మకంగా, ఫలితాలనిచ్చేలా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షాకాలంతో పార్లమెంట్ సమావేశాలను పోలుస్తూ.. వర్షాలు, పార్లమెంట్ సమావేశాలు రెండూ సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -