- Advertisement -

టీచర్‌పై ఆటోడ్రైవర్‌ కత్తి దాడి..ఎందుకో తెలుసా?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూలుకు వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేసి నగలు దోచుకెళ్లాడు. గూడూరు రూరల్ మండలం కందలి సమీపంలో ఈ ఘటన జరిగింది.

గూడూరుకు చెందిన హరిత (35) బాలాయపల్లి మండలం గొట్టిగాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ప్రతిరోజూ గూడూరు నుంచి స్కూలుకు వెళ్లి వస్తుంటారు. ఈ రోజు ఉదయం కూడా విధులకు హాజరుకావడానికి ఆటో ఎక్కారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను గమనించిన డ్రైవర్, నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి ఆటో ఆపాడు. అనంతరం కత్తితో దాడి చేసి నగలను అపహరించినట్లు సమాచారం.

దాడిలో తీవ్రంగా గాయపడిన హరితను రోడ్డుపై రక్తమోడుతూ వదిలేసి నిందితుడు పరారయ్యాడు. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు ఆమెను గమనించి వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -