- Advertisement -

తిరుమలలో అడవి శేష్- మృణాల్ సందడి

- Advertisement -

‘డెకాయిట్’ సినిమా ప్రమోషన్స్‌ను ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభించారు హీరో అడవీ శేష్,హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ చిత్రంలోని తొలి పాట ‘రుబారూ’ విడుదలైన అనంతరం, చిత్ర విజయాన్ని కోరుకుంటూ వారు తిరుపతి బాలాజీ ఆలయాన్ని సందర్శించి స్వామి వారి ఆశీస్సులు పొందారు.

ఏప్రిల్‌లో విడుదల కానున్న ‘డెకాయిట్’ సినిమా ప్రచార కార్యక్రమాలకు అర్థవంతమైన ఆరంభం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ దర్శనం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వచ్చిన ఈ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మృణాల్ క్రీమ్ రంగు చీరకు ఎరుపు అంచుతో అందంగా మెరిసిపోగా, అడివి శేష్ ఆఫ్ వైట్ సంప్రదాయ వస్త్రధారణలో దర్శనమిచ్చారు. వీరి తిరుమల దర్శనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్శన తమకు ఎంతో ప్రత్యేకమని అడివి శేష్ తెలిపారు. “ప్రతి సినిమా ఒక విశ్వాసంతో చేసే ప్రయాణం. ఎన్నో సంవత్సరాల శ్రమ తర్వాత దాన్ని ప్రేక్షకుల చేతుల్లో పెడతాం. అలాంటి ప్రయాణాన్ని తిరుపతిలో ప్రారంభించడం సరైన నిర్ణయంగా అనిపించింది” అని ఆయన అన్నారు. మరోవైపు మృణాల్ ఠాకూర్‌కు ఇది తిరుపతికి మొదటి సందర్శన అని, ఇకపై ప్రతి సంవత్సరం ఇక్కడికి రావాలని ఆశిస్తున్నానని తెలిపారు. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మించిన ‘డెకాయిట్’ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -