ఈ నెల 10వ తేదీన గుంటూరులో పర్యటించనున్నార మాజీ సీఎం జగన్. గుంటూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ వేదికగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ దావత్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా, ఈరోజు పార్టీ ముఖ్య నాయకులు కార్యక్రమ ప్రదేశాన్ని సందర్శించి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మన గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ , ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి , ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా , తెనాలి నియోజకవర్గ అబ్జర్వర్ గులాం రసూల్ , రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య , వీరితో పాటు పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఇఫ్తార్ దావత్ విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
