- Advertisement -

ఉస్తాద్ భగత్‌సింగ్..సక్సెస్‌మీట్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రం ఉగాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దర్శకుడు హరీష్‌ శంకర్ …పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో “గబ్బర్ సింగ్” తర్వాత వస్తున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.

ఈ వేడుకలో హరీష్ శంకర్ మాట్లాడుతూ…ఇది మాస్ ఎంటర్‌టైనర్ కావడంతో పాజిటివ్ టాక్ రావడానికి కొంత సమయం పడుతుందని అనుకున్నాను. కానీ మొదటి షోల నుంచే మంచి స్పందన వచ్చింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కంటెంట్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తోంది. నేను మొదటి నుంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ తీస్తున్నానని స్పష్టంగా చెప్పాను. అలాగే వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను చూపించాలనుకున్నాను అని అన్నారు.

అయితే ఇందులో మంచి అంశాలను కూడా చేర్చాం…. ముఖ్యంగా అక్రమ వలసదారుల సమస్యను ప్రస్తావించాం, ఇది ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో పెద్దగా చూపించలేదు. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంది, ప్రేక్షకులు ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా ‘తొలిప్రేమ’ పాట రీమిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమన్ చాలా తక్కువ సమయంలో అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు అని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -