- Advertisement -

IPL:గాయంతో ధోని దూరం..ఫ్యాన్స్‌కు షాక్

- Advertisement -

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే అభిమానులకు నిరాశ కలిగించే వార్త. కాలి కండరాల్లో (క్యాల్ఫ్ స్ట్రెయిన్) గాయం కారణంగా ధోనీ ప్రస్తుతం రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఈ కారణంగా ఐపీఎల్ 2026 తాజా సీజన్ తొలి రెండు వారాలు ఆయనకు దూరం అయ్యే అవకాశం ఉంది.

ఈ మేరకు సీఎస్‌కే అధికారికంగా ప్రకటించింది. ఎంఎస్ ధోనీ ప్రస్తుతం క్యాల్ఫ్ స్ట్రెయిన్ గాయం నుంచి కోలుకునేందుకు రీహాబ్‌లో ఉన్నారు. దీంతో ఐపీఎల్ 2026 తొలి రెండు వారాలు ఆయన మ్యాచ్‌లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం అని సీఎస్‌కే తెలిపింది.

సీఎస్‌కే తమ సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌తో ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ తో పాటు పంజాబ్ కింగ్స్ (హోమ్),రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (అవే),
ఢిల్లీ క్యాపిటల్స్ (హోమ్) మ్యాచ్‌లకు ధోనీ దూరంగా ఉండే అవకాశం ఉంది.

గత కొన్ని సంవత్సరాలుగా ధోనీ కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. మోకాలి గాయాలు ఉన్నప్పటికీ జట్టుకు అవసరమైన సమయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2023లో Gujarat Titansపై ఫైనల్లో విజయం సాధించి సీఎస్‌కేకు టైటిల్ అందించాడు. ధోనీ త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -