- Advertisement -

మార్గదర్శి ఫైనాన్స్ కేసు..సుప్రీం కీ కామెంట్స్

- Advertisement -

మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసును కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.

ఈ పిటిషన్ విచారణ సమయంలో రామోజీరావు చనిపోయాడని కేసు కొట్టేయాలని కోరారు మార్గదర్శి ఫైనాన్సియర్స్ తరపు న్యాయవాది. అయితే రామోజీరావు చనిపోయినంత మాత్రాన సంస్థపై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ తొలగిపోవని, అవసరమైతే ఆయన ఆస్తులు అన్ని జప్తు చేసి బాధితులకు పంచే హక్కు కూడా మాకుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి.

ఈ క్రమంలో బాధితులకు డబ్బు చెల్లింపులు పూర్తిచేశామని మార్గదర్శి తరపు న్యాయవాది తెలపగా ఈ వివాదంపై సమగ్ర వివరణ ఇవ్వాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్ చైర్మన్ చెరుకూరి కిరణ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ, జూలై 15వ తేదీకి విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

మార్గదర్శిలో 459 కోట్ల రూపాయలు దారి మళ్లించారన్న ఆరోపణల నేపథ్యంలో మార్గదర్శి ఛైర్మన్ చెరుకూరి రామోజీరావుపై సీఐడీ కేసు నమోదు అయింది. మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజ, పలు బ్రాంచ్ మేనేజర్లపై కూడా కేసు నమోదుకాగా A1 నిందితుడిగా చెరుకూరి రామోజీరావు, A2గా చెరుకూరి శైలజ, A3గా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లు ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -