- Advertisement -

నీ అందంతో ప్రమోట్ చెయ్.. గిరిజా ఓక్‌కు కంగనా క్రేజీ రిక్వెస్ట్!

- Advertisement -

ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక్క రాత్రిలోనే స్టార్‌డమ్ తెచ్చుకునే వైరల్ కల్చర్ గురించి మనకు తెలిసిందే. ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని, సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మారిన మరాఠీ నటి గిరిజా ఓక్ (Girija Oak) ఉదంతం ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ పాడ్‌కాస్ట్‌లో ఆమె నీలి రంగు చీర ధరించడంతో నెటిజన్లు ఆమెకు ‘బ్లూ శారీ గర్ల్’ అని పేరు పెట్టడమే కాకుండా, ఏకంగా ‘నేషనల్ క్రష్’ అంటూ ట్రెండ్ చేశారు.

‘భారత్ భాగ్య విధాత’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన తాజా ఇంటర్వ్యూలో హోస్ట్ గిరిజా ఓక్ వైరల్ టాపిక్‌ను ప్రస్తావించారు. దీనిపై కంగన స్పందిస్తూ.. “అవును, నేను ఈ విషయం విన్నాను. ఇంతకీ ఆ బ్లూ శారీ స్టోరీ ఏంటి?” అని ఆసక్తిగా అడిగారు. అప్పుడు గిరిజ నవ్వుతూ.. “అసలు ఆ వీడియో ఎందుకు అంత వైరల్ అయిందో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. అందులో నా నటనా ప్రతిభకు సంబంధించింది ఏమీ లేదు. ఎక్కువ మంది కేవలం నా అందం గురించే మాట్లాడారు. నా బ్యూటీ అనేది నా స్వయంకృషితో వచ్చిన ఘనత కాదని నేను ఫీలవుతాను.” అని చాలా ప్రాక్టికల్‌గా సమాధానమిచ్చారు. దీనిపై కంగనా రనౌత్ నవ్వుతూ.. “నువ్వు ఈ సినిమాలో నటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎలాగో వైరల్ అయ్యావు కాబట్టి, నీకున్న ఆ అందంతో మన మూవీని కాస్త ప్రమోట్ చెయ్..” అని సరదాగా కామెంట్ చేశారు.

ఇదే ఇంటర్వ్యూలో సోషల్ మీడియా ట్రెండ్స్ పై గిరిజా ఓక్ తనదైన అభిప్రాయాన్ని పంచుకున్నారు. జాతీయ స్థాయిలో ఒక నటికి గుర్తింపు రావాలంటే దానికి ఓ ప్రామాణికత, గట్టి పునాది ఉండాలని.. కేవలం సోషల్ మీడియాలో రెండు రోజులు ట్రెండ్ అయ్యే ‘నేషనల్ క్రష్’ అనే పదానికి ఎలాంటి అర్థం లేదని ఆమె స్పష్టం చేశారు.

ఇక ‘భారత్ భాగ్య విధాత’ సినిమా విషయానికొస్తే.. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో, దర్శకుడు మనోజ్ తపాడియా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో గిరిజా ఓక్, స్మితా తాంబే తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -