- Advertisement -

మెగా డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరపాల్సిందే: జగన్

- Advertisement -

మెగా డీఎస్సీలో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ వస్తున్న ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ కుంభకోణాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా చంద్రబాబు, లోకేష్‌ ఎన్నాళ్లు తప్పించుకుంటారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.

యువతను మోసం చేస్తూ డీఎస్సీలో ‘మెగా’ అంటే నిజాయితీపరులకు ‘దగా’గా మారిందని జగన్ విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేత రాజీనామా చేయించకుండా, అధికార బలంతో అబద్ధాలు ఆడుతూ కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో టెట్‌లో అర్హత లేని వ్యక్తికి స్పోర్ట్స్‌ కోటాలో ఎస్‌జీటీ పోస్టు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అధికారులతో ఈ అక్రమాలు చేయించిన ఆ అదృశ్య శక్తి లోకేష్ కాదంటారా అని నిలదీశారు.

రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో డీఎస్సీ-2025 నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని జగన్ ఆరోపించారు. ప్రభుత్వమే అధికారంలో ఉండగా, అధికారులతో జరిగే విచారణలు ఎప్పటికీ స్వతంత్రంగా జరగవని స్పష్టం చేశారు. అందుకే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోర్టులోనూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

కేవలం డీఎస్సీలోనే కాకుండా ఏపీపీఎస్సీ ద్వారా జరిగే నియామకాల్లోనూ ఈ అక్రమాలు పాకించారని జగన్ ఆరోపించారు. ఫైనాన్స్ క్లియరెన్స్ పొందిన అటవీశాఖ ఉద్యోగాల భర్తీలోనూ జీవో నంబర్-4ను అడ్డంపెట్టుకుని నిబంధనలు ఉల్లఘించారని విమర్శించారు. అక్రమాలు బయటపడతాయనే భయంతోనే మిగిలిన పోస్టుల భర్తీని కూడా నిలిపివేశారని మండిపడ్డారు. ఉద్యోగాలతో ర్యాలీలు చేయించుకున్నంత మాత్రాన ఈ స్కాంను కప్పిపుచ్చలేరని తేల్చిచెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -