- Advertisement -

యువకుడిని చంపి..దొరక్కుండా చేశారు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని…అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి, ఆధారాలు దొరక్కుండా బూడిదతో సహా కాల్చేసిన ఉదంతంపై ఆయన ఘాటుగా స్పందించారు. 79 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటి అమానుష, ఘోరమైన ఘటన ఎక్కడా జరగలేదని ఆయన మండిపడ్డారు.

ఈ సందర్భంగా గుడివాడ అమరనాథ్ మీడియాతో మాట్లాడుతూ…ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపాల్సింది పోయి, కక్షసాధింపు రాజకీయాలకు వేదికగా మార్చారని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ అమరనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఎప్పుడైతే ‘రెడ్ బుక్’ రాజ్యాంగం అంటూ వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారో అప్పటి నుంచే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. రాష్ట్రంలో చట్టం, న్యాయం పక్కనబెట్టి రెడ్ బుక్ ఆధారంగానే పాలన సాగిస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది” అని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో జరుగుతున్న వరుస దారుణాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశవ్యాప్తంగా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అమరనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘోరమైన నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం చేతగానితన ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. తక్షణమే ఈ హత్యోదంతంపై సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -