- Advertisement -

ఘోరం.. కుటుంబాన్నే హతమార్చిన కూతురు!

- Advertisement -

లివింగ్ రిలేషన్‌షిప్‌నకు అడ్డువచ్చారన్న కోపంతో కన్నతల్లిదండ్రులను, చెల్లిని ఒకే కుటుంబానికి చెందిన యువతి అత్యంత కిరాతకంగా హతమార్చింది. ఈ ఘటన బెంగళూరులోని సీగేహళ్లిలో ఆలస్యంగా వెలుగుచూసింది.

సీగేహళ్లికి చెందిన సోమసుందర్, ముత్తులక్ష్మి దంపతులకు శ్వేత, సుప్రియ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్వేత కన్నెత్ అనే యువకుడితో కలిసి గత కొంతకాలంగా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంటోంది. వీరి బంధాన్ని శ్వేత తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంపై ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గొడవ పరాకాష్టకు చేరడంతో, శ్వేత తన ప్రియుడితో కలిసి పథకం ప్రకారం తల్లిదండ్రులపై, చెల్లిపై కత్తులతో దాడి చేసింది.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడి సోమసుందర్, ముత్తులక్ష్మి, సుప్రియ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితురాలు శ్వేత తన ప్రియుడితో కలిసి ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారైంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న కేఆర్ పురం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న శ్వేత, ఆమె ప్రియుడు కన్నెత్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. లివింగ్ రిలేషన్ విషయంలో వచ్చిన వివాదం కారణంగా ఒకే కుటుంబంలోని ముగ్గురిని కడతేర్చిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -