- Advertisement -

సాయికృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలనం

- Advertisement -

సాయికృష్ణ లాకప్ డెట్ సిట్ రిపోర్ట్‌లో కీలక విష‌యాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి మాయం చేశారు ఇద్దరూ కానిస్టేబుల్స్, సీఐ సన్నిహితుడు. నాగరాజు అరెస్ట్ తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారుహెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని.

సీఐ అసిస్టెంట్‌గా హెడ్ కానిస్టేబుల్‌గా ఉన్నారు అశోక్. సీఐ పేరు చెప్పి ప్రైవేట్ వ్యవహారాలు నడపడంలో కీలకంగా ఉన్నారు హెడ్ కానిస్టేబుల్ నాని. గన్నవరం, పటమట స్టేషన్‌లో వచ్చిన అభియోగాల నేపథ్యంలో వీఆర్‌కి నానిని పంపారు. ఇటివలే కృష్ణలంక లో హెడ్ కానిస్టేబుల్ నానికి పోస్టింగ్ ఇచ్చారు.

మృతదేహాన్ని మాయం చేయడంతో కీలకంగా వ్యవహరించారు సీఐ సన్నిహితుడు అయినా సురేశ్. గత నెల 29వ తేదీన సాయికృష్ణ మేనమామ నవరంగ్‌ను సెటిల్ మెంట్‌కు పిలిచారు సురేష్‌. వడ్డేశ్వరంలోని నవరంగ్ ఇంటికి బ్లాక్ కలర్ వెహికల్‌ లో హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నానితో కలిసి వెళ్లారు సురేష్‌. ఇదే అంశాన్ని సిట్ అధికారులకు చెప్పారు సాయికృష్ణ మేనమామ నవరంగ్.

సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంతో ఈ ముగ్గురూ.. సీఐతో కలిసి పనిచేసినట్లు గుర్తించింది సిట్. పరారీలో ఉన్న ముగ్గురు కోసం గాలిస్తున్నారు సిట్ అధికారులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -