తెలుగుదేశం అధినేత కు గొప్పలు చెప్పుకొనే అలవాటు చాలా ఎక్కువ. ప్రత్యేకించి మైకు దొరికింది.. ఎదురుగా మీడియా ప్రతినిధులు సావధానంగా కనిపించారంటే బాబు రెచ్చిపోతారు. తన డప్పును ఒక రేంజ్ లో కొట్టుకొంటారు.
ఇదంతా కొత్తేమీ కాదు. దేశంలో కంప్యూటర్ల వాడకం అనేది తన వల్లనే జరుగుతోందని చెప్పుకొన్నా.. ఈ రోజుకు అందరి చేతిలోనూ సెల్ ఫోన్లు ఉన్నాయంటే అది తన దయే అన్నా… దేశంలో ఐటీ సెక్టార్ తన వల్లనే వృద్ది చెందింది అని చెప్పుకొన్నా.. అంబేద్కర్ కు భారతరత్న తనవల్లనే వచ్చిందని చెప్పాని.. అబ్దుల్ కలాం తన వల్లనే దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడని చెప్పుకొన్నా అది బాబు గారి కే చెల్లింది.
మరి గతంలో ఎన్నో సార్లు చెప్పుకొన్నారు చంద్రబాబు అబ్దుల్ కలాం తన వల్లనే దేశాధ్యక్షుడు అయ్యాడని. అయితే ఇప్పుడు కూడా బాబు అదే మాటే చెబుతున్నాడు. అబ్దుల్ కలాం మరణం నేపథ్యంలో నివాళిగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాబు ఇదే మాటే చెప్పారు. తన సిఫార్సు వల్లనే బీజేపీ వాళ్లు కలాంను రాష్ట్ర పతి చేశారని బాబు గారు చెప్పుకొన్నారు. అయితే కలాం మరణిచండంతో అందరూ విషాదంలో కూరుకుపోయిన సమయంలో బాబు ఇలా మాట్లాడటం విడ్డూరమే.
తను వ్యక్తిగతంగా కూడా ఒక అప్తుడిని కోల్పోయానని.. సన్నిహితుడిని కోల్పోయానని కూడా బాబు చెప్పుకొన్నారు. అయితే ఏపీ రాజధాని నిర్మాణం పనులను విదేశీ ఇంజనీర్లకు అప్పజెప్పుతున్న బాబు .. ఆ విధంగా విదేశీ మోజును చాటుకొంటున్న బాబు కలాంను గౌరవించాడంటే.. నమ్మలేమని చాలా మంది గొణుక్కొంటున్నారు.
