- Advertisement -

మృణాల్‌, జైస్వాల్‌ డేటింగ్.. అసలు నిజం అదే!

- Advertisement -

టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ప్రముఖ నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) వ్యక్తిగత జీవితంపై తరచూ ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తుంటుంది. తాజాగా టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల ముంబయిలోని ఓ కేఫ్ వద్ద వీరిద్దరూ కనిపించారంటూ వచ్చిన వార్తలు ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే ఈ డేటింగ్ రూమర్లపై తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా స్పందించి పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది.

అసలు ఆ రోజు ముంబయిలోని ఆ కేఫ్‌ వద్ద ఏం జరిగిందనే దానిపై స్పష్టతనిచ్చింది. యశస్వి జైస్వాల్‌ ఆ కేఫ్‌ నుంచి మొదట బయటకు వచ్చి తన కారు ఎక్కగా, ఆ తర్వాత కొద్దిసేపటికి మృణాల్‌ ఠాకూర్ కూడా అక్కడి నుంచి వెళ్లారు. ఇద్దరూ ఒకే ప్రదేశంలో కనిపించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల ఊహాగానాలు మొదలుపెట్టారు. కానీ వాస్తవానికి వీరిద్దరూ ఒకే సమయానికి ఆ కేఫ్‌కు వెళ్లలేదని తేలింది. మృణాల్‌ తన స్నేహితులతో కలిసి ఆ కేఫ్‌కు వెళ్లగా, యశస్వి ఆమె కంటే ముందే వేరే పనులపై అక్కడకు వచ్చారు. వేర్వేరు సమయాల్లో తీసిన రెండు వేర్వేరు వీడియోలను కొందరు కావాలనే కలిపి ఎడిట్‌ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఈ గందరగోళం తలెత్తిందని ఆ మీడియా సంస్థ స్పష్టం చేసింది.

మృణాల్‌ ఠాకూర్‌పై ఇలాంటి పుకార్లు రావడం కొత్తేమీ కాదు. గతంలోనూ పలువురు ప్రముఖులతో ఆమె పేరును ముడిపెడుతూ అనేక వదంతులు వచ్చాయి. స్టార్‌ హీరో ధనుష్‌తో ఆమె చనువుగా ఉన్న కొన్ని ఫొటోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని స్పష్టం చేస్తూ మృణాల్ ఆ ప్రచారానికి బ్రేక్ వేశారు.

అంతేకాకుండా, గతంలో టీమ్‌ఇండియా మరో క్రికెటర్ శ్రేయస్‌ అయ్యర్‌తోనూ ఆమె డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారమయ్యాయి. ఆ వదంతులను కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. ఏది ఏమైనా, సరైన ఆధారాలు లేకుండా కేవలం కొన్ని ఊహాగానాల ఆధారంగా సెలబ్రిటీలపై వచ్చే రూమర్లను నమ్మవద్దని దీనిద్వారా మరోసారి స్పష్టమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -