- Advertisement -

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం

- Advertisement -

దేశంలో పోటీ పరీక్షల్లో జరిగే అక్రమాలు, పేపర్ లీకేజీలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘యాంటీ పేపర్ లీక్ బిల్లు’కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సభలో చోటుచేసుకున్న తీవ్ర ఉత్కంఠ, చర్చల మధ్య మూజువాణి ఓటు ద్వారా ఈ బిల్లును లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఇటీవల వెలుగుచూసిన నీట్ (NEET-UG) పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరియు లక్షలాది మంది విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. జంతర్ మంతర్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో యువత చేపట్టిన వరుస నిరసనలు, ఆందోళనలు తీవ్ర ఒత్తిడిని పెంచాయి.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పరీక్షల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని CJP మరియు యువత డిమాండ్ చేశాయి. యువత మరియు విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత, నిరసనల సెగతో కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.

పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలపై విద్యార్థి లోకం చేసిన పోరాటం ఫలితంగానే ప్రభుత్వం ఈ కఠిన బిల్లును లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై…లీకేజీ ముఠాలపై కఠినమైన శిక్షలు మరియు భారీ జరిమానాలు విధించే అవకాశం ఏర్పడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -