- Advertisement -

‘ఈ వారాహికి ఎదురెళ్లి.. ఆవిడతోనే ఈ శాపం తప్పిస్తాను’

- Advertisement -

‘‘ఈ వారాహికి ఎదురెళ్లి.. ఆవిడతోనే ఈ శాపం తప్పిస్తాను’’ అంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే డైలాగ్‌తో వస్తోంది సరికొత్త చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. టాలెంటెడ్ హీరో సుమంత్, ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. సంతోష్‌ జాగర్లపూడి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. లక్ష్మణ్, కలిపు మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు.

‘‘చరిత్రకి అందని నగరం. ఆ పరమశివుడు నివసించే ప్రదేశం.. వారణాసి. ఆ వారణాసి గ్రామ దేవతే వారాహి’’ అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. మహేంద్రగిరి రాజకుటుంబంలో వరుసగా జరుగుతున్న మరణాలు, ఆ రహస్యాల వెనకున్న వారాహి మాత శాపాన్ని చిత్రంలో చూపించారు. ఆ శాపాన్ని ఛేదించేందుకు హీరో చేసే సాహసాలను ట్రైలర్‌లో థ్రిల్లింగ్‌గా ప్రదర్శించారు. ఈ సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ ఒక ప్రత్యేకమైన ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం.

ఈ ట్రైలర్ విడుదల వేడుకలో ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ప్రతి ఆధ్యాత్మిక సినిమా మన గొప్ప సంస్కృతిని తెలియజేస్తుందని, అలాంటి చిత్రాలను అందరం సపోర్ట్ చేయాలని కోరారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందని తెలిపారు.

హీరో సుమంత్ మాట్లాడుతూ.. ఈ ట్రైలర్ అందరికీ నచ్చడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. ఈ సినిమాతో తాను దాదాపు మూడేళ్ల పాటు ప్రయాణించానని తెలిపారు. చాలా పెద్ద బడ్జెట్‌తో, భారీ స్థాయిలో తెరకెక్కించాల్సిన సినిమా ఇదని, ఎక్కడా ఎలాంటి రాజీ పడకుండా నిర్మాతలు నిర్మించారని కొనియాడారు. ఈ చిత్రంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఆ నమ్మకం ట్రైలర్‌తో ప్రేక్షకులందరికీ కలిగిందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబరు 11న థియేటర్లలో తమ కష్టాన్ని అందరూ చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు మధు, లక్ష్మణ్, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్, నటీనటులు మీనాక్షి గోస్వామి తదితరులు సందడి చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -