- Advertisement -

1643 మంది విద్యార్థుల ప్రాణాలు రక్షించిన టీచ‌ర్!

- Advertisement -

నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలు (Nepal Floods) తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ పెను విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ చాలా మంది ఆచూకీ గల్లంతు కావడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భయానక వాతావరణంలోనూ ఓ ఉపాధ్యాయుడు ప్రదర్శించిన అద్భుతమైన సమయస్ఫూర్తి వేలాది మంది చిన్నారుల ప్రాణాలను కాపాడింది.

నేపాల్‌లోని త్రిశూలి ప్రాంతంలో త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ఉంది. ఈ పాఠశాలలో రాజేంద్ర దవాడి అనే ఉపాధ్యాయుడు పని చేస్తున్నారు. వరదలు మొదలైన బుధవారం ఉదయం ఆయనకు అత్యవసర హెచ్చరిక అందింది. ఆ సమాచారం అందగానే ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే అప్రమత్తమై పాఠశాలలో అలారం మోగించారు. తోటి ఉపాధ్యాయుల సహాయంతో పాఠశాలలో ఉన్న మొత్తం 1,643 మంది విద్యార్థులను ఒకచోటుకు చేర్చారు. అలాగే స్కూల్ బస్సు డ్రైవర్లను కూడా వెంటనే అప్రమత్తం చేశారు.

విద్యార్థులను బస్సులలో ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అప్పటికే స్థానికంగా ఉన్న రోడ్లు, భవనాలు వరద నీటికి కొట్టుకుపోతున్నాయి. బస్సుల ద్వారా వెళ్లడం ప్రమాదకరమని గ్రహించారు. వెంటనే సమీపంలోని మరో సురక్షిత ప్రాంతానికి పిల్లలను తరలించాలని నిర్ణయించుకున్నారు. పాఠశాలకు దగ్గర్లో ఉన్న ఎత్తైన ప్రదేశంలోని ఒక భారీ చెట్టు కిందకు విద్యార్థులందరినీ సురక్షితంగా నడిపించి తీసుకెళ్లారు.

పిల్లలందరినీ అక్కడికి చేర్చిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే తీవ్రమైన వరద ముంచెత్తింది. ఆ భారీ వరద ప్రవాహ ధాటికి ఏకంగా మూడు అంతస్తుల పాఠశాల భవనం పూర్తిగా కొట్టుకుపోయింది. ఒకవేళ ఉపాధ్యాయుడు సమయస్ఫూర్తితో వ్యవహరించకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగేది. కేవలం నిమిషాల వ్యవధిలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ విపత్తులో పాఠశాలకు చెందిన ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అంతటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా విద్యార్థులను కాపాడిన టీచర్‌ రాజేంద్ర దవాడి సాహసాన్ని అందరూ కొనియాడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు కురిపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -