- Advertisement -

ఒకే మహిళ‌తో ఇద్ద‌రికి వివాహేతర సంబంధం.. కారుతో ఢీకొట్టి..

- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రేమ, వివాహేతర సంబంధాలు ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఒకే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన గొడవ హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామానికి చెందిన మౌలానా (42), ఇస్మాయిల్ అనే ఇద్దరు వ్యక్తులు ఒకే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయమై గత కొంతకాలంగా వారి మధ్య మనస్పర్థలు, వివాదాలు నడుస్తున్నాయి. ఇదే విషయంలో శుక్రవారం ఇద్దరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఈ వివాదం మరింత ముదిరి ఆగ్రహానికి గురైన ఇస్మాయిల్, తన కారుతో మౌలానాను వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మౌలానా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మౌలానా మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనతో మౌలానా కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. మౌలానా సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు ఇస్మాయిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, తన సోదరుడి మృతికి కారణమైన ఇస్మాయిల్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మౌలానా కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కసారిగా నిందితుడి ఇంటిపై దాడి చేశారు. ఇస్మాయిల్ ఇంటికి నిప్పంటించి తమ నిరసన తెలిపారు.

ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -