- Advertisement -

స్పిరిట్ ను టార్గెట్ చేయాల‌ని ఛాలెంజ్!

- Advertisement -

నిర్మాత ప్రణయ్‌ రెడ్డి వంగా తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన ‘రోమాంచకం’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాపై వచ్చిన కొన్ని విమర్శల గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఒక ప్రాజెక్ట్‌ను విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం వెనుక ఎంతో మంది శ్రమ ఉంటుందని గుర్తుచేశారు.

సినిమా నిర్మాణ రంగంలో ఉన్నవారికే ఆ కష్టాలు పూర్తిగా అర్థమవుతాయని ప్రణయ్ తెలిపారు. రచయిత రాసిన కథను తెరపైకి తీసుకురావడానికి దర్శకుడు పడే కష్టాలు, షూటింగ్ సమయంలో ఎదురయ్యే సవాళ్లు అందరికీ తెలియవన్నారు. ‘రోమాంచకం’ సినిమా విషయంలో కొందరు కావాలనే కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు అనవసరమైన విమర్శలు చేశారని మండిపడ్డారు. అలాంటి వారికి నిజంగానే అంత సామర్థ్యం ఉంటే.. రాబోయే తమ భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్‌’ స్థాయిని తగ్గించగలరా అంటూ సవాల్ విసిరారు.

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’. ఈ సినిమా షూటింగ్ దశ నుంచే భారీ అంచనాలు నెలకొల్పింది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి గతంలో కొన్ని వివాదాలు కూడా తెరపైకి వచ్చాయి. మొదట ఈ చిత్రంలో నటి దీపికా పదుకొణెను కథానాయికగా ఎంపిక చేయాలని భావించారు. ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు సందీప్ ఆమెతో దాదాపు ఏడాదిన్నర పాటు వర్క్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఆ తర్వాత ఊహించని పరిణామాల మధ్య దీపిక స్థానంలోకి ప్రముఖ నటి త్రిప్తి దిమ్రీని తీసుకున్నారు. ఆ సమయంలో దీపికే ఈ సినిమా కథను లీక్ చేశారనే ఆరోపణలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుతం అన్ని వివాదాలను పక్కనపెట్టి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘స్పిరిట్’ సినిమాను వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -