డిసెంబరు 13 నుంచి 17 వరకు దుబాయ్‌లో జరిగే సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో తలపడేందుకు ఇద్దరు భారత క్రీడాకారులు ఎంపికయ్యారు. వారే భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు, తెలుగు తేజాలు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-8 స్థానాల్లో ఉన్న క్రీడాకారులు సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో తలపడేందుకు అవకాశం దక్కుతోంది. మహిళల సింగిల్స్‌లో ప్రస్తుతం సింధు మూడో స్థానంలో కొనసాగుతుండగా.. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ ఐదో ర్యాంకును దక్కించుకున్నాడు. దీంతో వీరిద్దరు మాత్రమే ఈ టోర్నీకి అర్హత సాధించారు. హెచ్ ఎస్ ప్రణయ్, సైనా నెహ్వాల్ 10వ ర్యాంకులో కొనసాగుతున్నారు. తాజాగా సింధు హాంకాంగ్ సూపర్ సిరీస్ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే శ్రీకాంత్ ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచాడు.
