- Advertisement -

బాబు, జగన్‌లకంటే పవన్‌కే కుల పిచ్చి ఎక్కువ…… కులం ఓట్ల కోసం పవన్ పడుతున్న పాట్లు ఎన్నంటే?

- Advertisement -

చంద్రబాబునాయుడు ఎప్పుడూ కూడా ఏ విషయాన్ని కూడా డైరెక్ట్‌గా చెప్పడు. అబద్ధపు రాజకీయ డ్రామాలతో కాలం వెళ్ళదీస్తూ ఉంటాడు. రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా, రైల్వేజోన్….ఇలా ఏ ఒక్క విషయంపైన అయినా స్పష్టంగా మాట్లాడాడా? ఇక తునిఘటనతో సహా ఎన్నో విషయాలను జగన్‌కి ఆపాదిస్తూ చెప్పీ చెప్పనట్టుగా చెప్పుకొచ్చాడు. తను చేయలేకపోతున్న ఎన్నో పనులకు, తన అసమర్థతకు జగన్‌ని బూచీగా చూపిస్తూ ఉంటాడు. ఇంటెలిజెన్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్ మొత్తం తన చేతుల్లో ఉంచుకున్న చంద్రబాబుకు ఆరోపణలు చేయాల్సిన అవసరమేంటి? తప్పులు చేసి ఉంటే జగన్‌ని అరెస్ట్ చేయించొచ్చుగా? కేంద్రప్రభుత్వంలో కూడా భాగస్వామి అయిన చంద్రబాబు…..జగన్ తప్పులను నిరూపించి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? జగన్ అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకుని రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన బాబు ఇఫ్పటి వరకూ ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎందుకంటే చంద్రబాబు మాటల్లోని నిజాలు ఎన్నో చంద్రబాబుకు స్పష్టంగా తెలుసుకాబట్టి. కానీ తన అసమర్థత బయటపడకుండా ఉండడానికి జగన్‌ని బూచీగా చూపించడం బాబుకు అవసరం. అధికార దాహంతో ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన నాడు కూడా చంద్రబాబు చేసింది ఇదే. లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి ఎన్టీఆర్ పదవిని, పార్టీని లాగేసుకున్నాడు. ఎన్టీఆర్ దగ్గర ఉన్న డబ్బులన్నీ లక్ష్మీపార్వతినే దోచుకుంది అని ఆనాడు ఆరోపించారు. మరి అలాంటి లక్ష్మీపార్వతి ఈరోజు పదివేల రూపాయల అద్దె ఇంట్లో ఎందుకు ఉంది? ఆ అద్దె కూడా వైకాపా నేతలు కడుతున్న దయనీయ పరిస్థితిలో ఎందుకు ఉంది? ఈ ఒక్క విషయం చాలు లక్ష్మీపార్వతిని బూచీగా చూపించి చంద్రబాబు, ఆయన భజన మీడియా ఆడిన డ్రామా గురించి అర్థం చేసుకోవడానికి.

బలమైన భజన మీడియా ఉన్న చంద్రబాబు ఆడిన రాజకీయ డ్రామాలనే తాను ఆడతానంటున్నాడు ఇప్పుడు పవన్. కులాన్ని ఆపాదించొద్దు అంటూ పవన్ చెప్తున్న మాటలు వింటుంటే కులం ఓట్లపైన పవన్ కళ్యాణ్ ఎన్ని ఆశలు పెట్టుకుని ఉన్నాడో అర్థమవుతూనే ఉంది. నేను భారతీయుడిని అని గొప్పగా బిల్డప్ ఇస్తాడు. కాపులకు పదిహేడు శాతం రిజర్వేషన్స్ ఇవ్వకుండా ఐదు శాతంతో ఎందుకు సరిపెట్టారని అడుగుతాడు? విందుభోజనం తినిపిస్తామని చెప్పి ఆవకాయ బద్ధ నాకించారని వాపోతాడు. నేను భారతీయుడిని అని ఇచ్చిన మొదటి బిల్డప్ డైలాగ్‌కి…..కాపులకు పదిహేడు శాతం రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి ఐదుశాతమే ఇచ్చి అన్యాయం చేశారని చెప్పిన రెండో మాటకూ సంబంధం ఉందా? కుల వ్యవస్థే ఉండకూడదంటాడు? రిజర్వేషన్స్ అవసరం లేని సమాజం కావాలంటాడు. మళ్ళీ అదే నోటితో కాపులకు పదిహేడు శాతం రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి ఐదు శాతమే ఇచ్చి అన్యాయం చేశారని వాపోతాడు. కాపు రిజర్వేషన్స్ విషయంలో న్యాయం జరగకపోతే తునిలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతాయంటాడు. ఒకవైపేమో తుని ఘటనకు కారణం జగన్ అంటాడు. మరి ఇప్పుడు కాపు రిజర్వేషన్స్ విషయంలో అన్యాయం జరిగితే తుని లాంటి ఘటనలే జరుగుతాయన్న పవన్ మాటలు వింటుంటే అర్థమయ్యేదేంటి? రిజర్వేషన్స్ విషయంలో అన్యాయం జరగబట్టే కాపులే తుని ఘటనకు పాల్పడ్డారని పవన్ చెప్తున్నాడా? కాపు రిజర్వేషన్స్ విషయంలో అన్యాయం జరిగితే మళ్ళీ మళ్ళీ తుని లాంటి ఘటనలే జరుగుతాయని చెప్పి పవన్ కాపులను రెచ్చగొడుతున్నాడా? ఈ ప్రశ్నలన్నింటికీ అవునని మాత్రమే సమాధానం వస్తోంది. కాదని ఎవరైనా చెప్పగలరా? కాపుల కోసం పవన్ పోరాడితే తప్పేంటి అని అడిగితే మాత్రం ఏమీ చెప్పలేం. కానీ ఆ పోరాటం ఏదో డైరెక్ట్‌గా చెయ్యొచ్చుగా. ఇలా పైకి భారతీయుడిని అన్న డైలాగులు……లోపలేమో కాపు కులం ఓట్ల కోసం తాపత్రయం ఎందుకు? అలాగే కాపులకు పదిహేడు శాతం రిజర్వేషన్స్ కోసం తాను పోరాటం చేస్తానని చెప్పగలడా పవన్? ఇక కాపులకు, బిసిలకు మధ్య యుద్ధం రాజేస్తున్నారని కూడా పవన్ చెప్పుకొచ్చాడు. కాపులకు పదిహేడు శాతం రిజర్వేషన్స్…….అది కూడా బిసి కోటాలో ఇవ్వాలని అడిగితే బిసిలకు కోపం రాదా? కాపు రిజర్వేషన్స్ కోసం కాపు నాయకులు పోరాడుతున్నప్పుడు……బిసి రిజర్వేషన్స్‌లో అన్యాయం జరగకుండా బిసి నాయకులు పోరాడితే తప్పేంటి? అసలు కుల పోరాటాలు మొదలు పెట్టేదే కులం ఓట్లు కొల్లగొట్టాలనుకునే, కులం మద్ధతుతో రాజకీయాలు చేయాలనుకునేవాళ్ళు కాదా? చంద్రబాబుకు కమ్మలు, జగన్‌కి రెడ్లు ఎక్కువ శాతం మద్ధతు ఇస్తున్నారన్నది నిజం. అయితే అధినేతల స్థాయిలో చంద్రబాబు, జగన్‌లు ఎప్పుడూ కులాల గురించి మాట్లాడింది లేదు. కానీ పవన్ మాత్రం కులాల రాజకీయాలను ఇంకాస్త దిగువ స్థాయికి…..సిగ్గుపడేస్థాయికి తీసుకెళ్ళేలా కనిపిస్తున్నాడు. ఇదేనా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చే సరికొత్త రంగుల రాజకీయం.

లాస్ట్ పంచ్ః 2014 తర్వాత నుంచి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో దారుణాలు చోటు చేసుకున్నాయి. పడవ ప్రమాదంలో ఇరవై మంది పైగా చనిపోతే ఇప్పటి వరకూ పవన్ స్పందించలేదు. పుష్కర ప్రమాదంపై ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయాడు. ఇక జేసీల బస్సు ప్రమాద ఘటనపై కూడా పవన్ స్పందించింది లేదు. కానీ ఒక్క తుని ఘటన విషయంలో మాత్రం ….ఆ టైంకి కేరళలో ఉన్న పవన్…స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చి మరీ తీవ్ర ఆవేధన వెలిబుచ్చుతూ ……పొలిటికిల్ యాక్టింగ్‌ని ఇరగదీస్తూ స్పందించాడు. మరి ఆ స్థాయి ఆవేధన పడవ ప్రమాదంలో ఇరవై మందికి చనిపోయినప్పుడు, చంద్రబాబు ప్రచార యావ పుణ్యమాని మూడు పదుల సంఖ్యలో భక్లులు చనిపోయినప్పుడు ఎందుకు కలగలేదో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -