- Advertisement -

రేపు తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ బంద్‌….

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీలు చూస్తూ వినోదాన్ని ఆస్వాదించే ప్రేక్షకులకు కేబుల్ ఆర‌పేట‌ర్ల సంఘం షాక్ ఇచ్చింది. ట్రాయ్ నిర్దేశించిన కొత్త టారిఫ్ విదానానికి వ్య‌తిరేకంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8గంటల వ‌ర‌కువార్తా ఛానళ్లను మినహాయించి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ళ్ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు కేబుల్ ఆపరేటర్లు తెలిపారు.

ట్రాయ్ తీసుకున్న నిర్ణయాన్ని కేబుల్ ఆపరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రాయ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొత్త టారిఫ్ అమలుకు ట్రాయ్ జనవరి 31, 2019ని డెడ్‌లైన్‌గా విధించింది. డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాం ఆపరేటర్లు కొత్త టారిఫ్ అనుసంధానంలో విఫలం కావడంతో ట్రాయ్ గతంలో ప్రకటించిన డెడ్‌లైన్‌ను పొడిగించింది.

ట్రాయ్ కొత్త టారిఫ్ విధానం వ‌ల్ల వినియోగదారులు రూ.400 – 450 కేబుల్ బిల్లు కట్టాల్సి ఉంటుందన్నారు. తాము 400 ఛానల్స్‌ను రూ.200 – 250 ఛార్జ్ చేస్తున్నామని కేబుల్ ప‌ప‌రేట‌ర్లు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -