- Advertisement -

రాజ‌కీయాల్లో హాట్ హాట్‌గా మారిన మోహ‌న్‌బాబు, ముద్ర‌గ‌డ భేటీ..

- Advertisement -

ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ సంద‌ర్భంగా మోహ‌న్‌బాబు, కాపు నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంతో భేటీ కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆదివారం పాలకొల్లు పట్టణంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. పట్టణ కాపు నాయకుడు ముచ్చర్ల శ్రీరాం ఇంటిలో మోహన్‌బాబు, పద్మనాభం అల్పాహార విందుకు హాజరయ్యారు. ఈ భేటీలో ప‌లు అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.

విగ్రహావిష్కరణకు ఎందుకు రాలేదని ఈ సందర్భంగా మోహన్ బాబు.. ముద్రగడని ప్రశ్నించగా.. తనకు ఆహ్వానం అందలేదని చెప్పారు. దీనిపై మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడను కూడా ఆహ్వానించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

రాజకీయ పరిణామాలు మారుతున్న పరిస్థితుల్లో మోహన్‌బాబు, పద్మనాభంల మధ్య ఎటువంటి చర్చలు జరిగాయా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సమయం కావడంతో రాజకీయపరంగా వీరిద్దరి బేటీ హాట్‌ టాపిక్‌ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -