Friday, May 17, 2024
- Advertisement -

బాబుతో ఆర్కే, లగడపాటి భేటీ…… తెలంగాణాను మించిన వ్యూహం

- Advertisement -

ఐదేళ్ళలో చేసింది ఇది అని చెప్పుకుని ధైర్యంగా ఎన్నికలకు వెళ్ళలేని పరిస్థితి చంద్రబాబుది. మీడియా అంతా తన చేతుల్లో ఉన్నప్పుడు, ఎన్టీఆర్ వెన్నుపోటు కాలంలో తెలుగు ప్రజలు చంద్రబాబు మార్క్ రాజకీయాలను, కుట్రలను అర్థం చేసుకోలేకపోయినా ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమాని అందరికీ అన్నీ విషయాలు తెలుస్తున్నాయి. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం తన రాజకీయ వ్యూహాలు, ప్రచార జిమ్మిక్కులతోనే ఎన్నికల్లో గెలవాలని ఆలోచిస్తున్నారు. తెలంగాణా ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టినప్పటికీ మరోసారి అలాంటి రాజకీయ మాయలనే సీమాంధ్రలో కూడా అమలు పరిచే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా బాబు నమ్మన బంటు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, లగడపాటి రాజగోపాల్‌లు స్వయంగా చంద్రబాబుతో చీకటి రాజకీయం చేశారు. అర్థరాత్రి సమయంలో సీక్రెట్‌గా కలిశారు కానీ ఇప్పుడున్న సెల్ కెమేరాల పుణ్యమాని ఏదీ దాచలేరు కదా……..అందుకే కెమేరాల సాక్షిగా దొరికిపోయారు.

ఆ వెంటనే అంతా రాష్ట్రం కోసమే, సీమాంధ్ర ప్రజలను ఉద్ధరించడానికే ఇదో చారిత్రక కలయిక అన్న రేంజ్‌లో పచ్చ బ్యాచ్ జనాలు కవరింగులు ఇచ్చుకోగలరు కానీ చంద్రబాబుతో లగడపాటి, ఆర్కేల కలయిక మాత్రం ప్రజాస్వామ్య వాదులను బాధిస్తోంది. ఎన్నికలను కుట్రలతో, వ్యూహాలతో ఎదుర్కోవడం సబబు కాదని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ప్రచార మాయలతో ప్రజలను నమ్మించాలని చూసే ఇలాంటి ప్రయత్నాలు హర్షించదగ్గవి కాదని, ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్ళు అధికారంలో ఉండగా ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేయకుండా, అబద్ధపు హామీలతో మోసం చేసి ఇప్పుడు అదే ప్రజల అభిప్రాయాలను అబద్ధపు ప్రచారంతో, వ్యూహాలతో ప్రభావితం చేసి మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేయడం సరైన రాజకీయం కాదని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.

అలాంటి రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని………లేనిపక్షంలో ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను అస్సలు పట్టించుకోకపోయినా, అన్ని రకాలుగా మోసం చేసినా ఎన్నికల సమయంలో ప్రచార మాయలతో, రాజకీయ కుట్రలు, వ్యూహాలతో అధికారంలో రావడం సులభం అన్న అభిప్రాయం రాజకీయ నాయకులకు వచ్చే అవకాశం ఉందని సీనియర్ రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -