- Advertisement -

బోయపాటి ‘టీడీపీ’ బాంబులు.. పేలుతున్నాయ్..

- Advertisement -

బోయపాటి శ్రీను.. ఈయన ట్రాక్ రికార్డు మామూలుగా లేదు.. ఎమోషనల్, అగ్రెసివ్, యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్లు రూపొందించడంలో టాలీవుడ్ దర్శకుల్లో రాజమౌళి, బోయపాటి ఎవరికి వారే సాటి.. బోయపాటి సినిమాల్లో ఆ కసి కాస్తా ఎక్కువే ఉంటుంది. సినిమాలో లీనం చేసి విలన్ ను మనమే చంపేయలన్న కసి, ఎమోషన్ తో బోయపాటి సినిమాలు తీస్తుంటాడు.. హిట్స్ కొడుతుంటాడు.. మెప్పిస్తాడు.. అలాంటి బోయపాటి చేతిలో టీడీపీ యాడ్స్ పడ్డాయి. అందుకే ఇప్పుడు అదిరిపోయేలా వస్తున్నాయి..

ఎన్నికల ప్రచారం వేళ బాబు తన టీడీపీ ప్రచార యాడ్ లను పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్న బోయపాటి చేతిలో పెట్టారు. ఆయన టీడీపీ పథకాలపై చేసిన యాడ్స్ ప్రస్తుతం టీవీల్లో 5 నిమిషాలకోసారి వస్తున్నాయి.. చూస్తుండగానే చాలా ఎమోషనల్ గా టచ్ అవుతున్నాయి. తటస్థ ఓటర్లు కూడా బాబు చేసిన ఈ పనులకు ఓటేయాలన్నంతగా కట్టిపడేసేలా బోయపాటి మార్క్ ప్రకటనలు రూపొందాయి. ఏపార్టీ కూడా అంత ఎమోషనల్ గా ప్రకటనలు రూపొందించలేదంటే అతిశయోక్తి కాదు..

ఇప్పుడు తాజాగా మోడీ ప్రత్యేక హోదా మోసంపై కూడా బోయపాటి బిగ్ బాంబ్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. అమరావతి వచ్చి కుండలో నీళ్లు, పిడికెడు మట్టి మాత్రమే ఇచ్చిన మోడీని ఎండగట్టేందుకు మాంచి మసాలా యాడ్ రూపొందిస్తున్నారట.. దీంతో టీడీపీకి హైప్ వచ్చేలా ప్లాన్ చేశాడట.. ఈ దెబ్బకు మోడీ మోసంపై సెంటిమెంట్ రగిలి ఓట్ల వాన పడుతుందని ఘంటా పథంగా చెబుతున్నారు. సినిమాల్లోనే కాదు.. ప్రచార ప్రకటనల్లోనూ బోయపాటి బాంబులు బాగానే పేలుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -