- Advertisement -

సుజిత్ తల్లిదండ్రులకు లారెన్స్ విన్నపం..!

- Advertisement -

తమిళనాడులోని తిరుచ్చిలో బోరుబావిలో పడిన చిన్నారి సుజిత్ కథ విషాదాంతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుజిత్ మృతి పట్ల డాన్స్ మాస్టర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సుజిత్ మృతి పట్ల దేశం అంత శోకసంద్రంలో మునిగిపోయిందని.. చిన్నారి మృతికి చింతిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా చిన్నారి తల్లిదండ్రులకు వ్విజ్ఞప్తి చేశారు.

సుజిత్ లేని లోటును తీర్చేందుకు.. వీలైతే ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు ఓకె చెబితే.. ఆ బిడ్డ చదువులకు అవసరమయ్యే ఖర్చు తాను భరిస్తానని చెప్పారు. లారెన్స్ చేసిన ఈ ట్వీట్ పై చాలా మంది ప్రశంసలు చేస్తున్నారు. లార్స్ గొప్ప వ్యక్తి అని చెబుతున్నారు. ఇక లారెన్స్ ప్రతిపాదనకు సుజిత్ తల్లిదండ్రుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

కాగా.. బోరుబావిలో పడ్డ సుజీత్ ను రక్షించేందుకు నాలుగు రోజులు అవిశ్రాంతంగా శ్రమించినా.. ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. మొదట 35 అడుగుల లోతులో ఉన్న చిన్నారి.. ఆ తర్వాత 90 అడుగుల లోతులోకి పడిపోవడంతో.. అతన్ని రక్షించడం కష్టంగా మారింది. దాంతో సోమవారం రాత్రి అపస్మారిక స్థితిలోకి వెళ్లిన చిన్నారి.. అర్దరాత్రి చనిపోయినట్లు గుర్తించారు.

బోరు బావిలో నుంచి కుళ్లిపోయిన వాసన రావడంతో.. వైద్యులు అక్కడికి వచ్చి పరిశీలించారు. సుజిత్ చనిపోయినట్లు అధికారికంగా ధ్రువీకరించారు. సుజిత్ మృతితో.. అతను క్షేమంగా బయటకు రావాలని ప్రార్ధించిన వాళ్లంతా విషాదంలో మునిగిపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -