పాపం ఆ హీరోయిన్ కి జుట్టు రాలిపోతోంది .. ఒకటే గోల

బాలీవుడ్ లో టాప్ బ్యూటీలకు కూడా కష్టాలుంటాయా అంటే.. ఎవరి రేంజ్ లో వారికి ఉండడం ఎప్పుడూ జరిగేదే. బ్యూటీ అనుష్క శర్మకు కూడా ఇలాంటి కష్టమే ఒకటి ఉందిట. అదే.. జుట్టు రాలిపోవడం. ఈ హెయిర్ ఫాల్ చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యే కానీ.. మరి సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న ఈ అందగత్తెకు బోలెడన్ని కష్టాలను కూడా కొనితెచ్చేదట.

కనీసం వైట్ కలర్ డ్రస్ లు వేసుకోవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చిందిట అనుష్కకి. ‘ఈ ఏడాది నాకు చాలా ఛాలెంజింగ్. వరుసగా సినిమాలు చేయాల్సి రావడం.. ఊళ్లు-దేశాలు పట్టుకుని తిరగడం.. రకరకాల వాతావరణాలు.. రకరకాల పరిస్థితులు.

ఇవన్నీ కలిసి హెయిర్ ఫాల్ ను విపరీతంగా పెంచేశాయి. నాకు ఇదో పీడకలగా మారిపోయింది కూడా. అలాంటప్పుడే #14డేఛాలెంజ్ తీసుకున్నా.. ఇప్పుడు ఎలాంటి టాప్స్ అయినా వేసుకోగలను. నా హెయిర్ ను లూజ్ గా వదిలేయగలను కూడా. ఇప్పుడు నా హెయిర్ హెల్దీ అండ్ స్ట్రాంగ్’ అంటోంది అనుష్క శర్మ.

Related

  1. రాజమౌళి సీక్రెట్స్ బయట పెట్టిన అనుష్క!
  2. అనుష్క పెళ్లి చేసుకునేది ఇతనినే?
  3. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!
  4. అనుష్క ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలుసా?