Saturday, May 4, 2024
- Advertisement -

బాహుబలి టాక్ః టికెట్ కోసం వృథాగా అంత డబ్బు పోశాం!

- Advertisement -

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన భారీ చిత్రం ‘బాహుబలి’ పై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. తొలి రోజున ఈ సినిమా  చూసిన క్రేజీ ఫ్యాన్స్  సినిమా విషయంలో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఓవరాల్ గా మాత్రం వారి నుంచి తీవ్ర నిరాశే వ్యక్తం అవుతోంది. సినిమా మీద భారీ ఎక్స్ పెక్టేషన్లు పెట్టుకొని వెళ్లిన వారు నిరాశపూర్వకమైన అప్ డేట్స్ ను ఇస్తున్నారు. సినిమా పైతాము పెట్టుకొన్న అంచనాలు ఎక్కడో ఉంటే.. సినిమా స్థాయి మాత్రం మరెక్కడో ఉందనే అభిప్రాయాలు వారి నుంచి వ్యక్తం అవుతున్నాయి!

సినిమా కథలో ఏమాత్రం కొత్తదనం లేదు.. అనేది ప్రధానంగా వస్తున్న ఫిర్యాదు. ఎన్నో జానపద కథల్లా.. అంతా ఎక్స్ పెక్టెడ్ గానే ఉంది అని వారు అంటున్నారు. అయితే విజువలైజేషన్ లో మాత్రం సినిమా రిచ్ గా కనిపిస్తుందని.. కానీ కథ లేనప్పుడు విజువల్ గా ఎంత అద్భుతంగా ఉండి ఏం ప్రయోజనం అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమాను అవతార్ తో పోల్చారు అని.. ఏదో అద్భుతమైన సినిమా అని బిల్డప్ ఇచ్చారని.. తీరా తెరపై మాత్రం అంత సీన్ లేకుండా పోయిందని వారు అంటున్నారు. వీళ్లు కావాలని బాహుబలి సినిమా విషయంలో నెగిటివ్ ప్రచారం చేస్తున్న వారు కాదు… సినిమా మీద ఎన్నో ఆశలతో.. భారీ అంచనాలతో వెళ్లిన వారు.
వేల రూపాయలు పోసి టికెట్ ను కొనుగోలు చేసిన వారు. టికెట్ కు తాము పెట్టిన డబ్బుకు న్యాయం జరగలేదని వీరు బాధపడుతున్నారు.

బాహుబలి ఐ పీస్ట్ కాలేకపోయిందనే అభిప్రాయాన్ని వీరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా.. కేవలం ఏదో ఒక సినిమా చూస్తాం.. అద్బుతమైన సినిమా ఏమీ చూడబోవడం లేదు.. అనే అంచనాలతో మాత్రమే వెళితే బాహుబలి కొంత వరకూ అనుభూతిని కలగజేయగలదని సినిమా చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. అంచనాలు పెట్టుకోకుండా వెళ్లిన వారు మాత్రమే సినిమాను ఆస్వాధించగలరని అంటున్నారు. సినిమాపై భారీ అంచనాలు పెంచి తప్పు చేశారని వారు విశ్లేషిస్తున్నారు. అత్యంత సాధాసీద కథనంతో బాహుబలి నిరాశ పరుస్తుందని… కొన్ని సీన్లు హైలెట్ గానే ఉన్నా… అవి ఇది వరకే కొన్ని హాలీవుడ్ సినిమాల్లో చూసినట్టుగా… అనిపిస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాను ఎమోషన్ నడిస్తుందని రాజమౌళి చెప్పాడని.. అయితే అలాంటి ఛాయలు ఏమీ కథ, కథనాల్లో లేవని వారు తేల్చి చెబుతుండటం విశేషం.

Watch video: Prabhas craze in Baahubali

{youtube}S977gR5TS5o{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -