Sunday, May 19, 2024
- Advertisement -

బాబు బంగారం మూవీ రివ్యూ

- Advertisement -

భ‌లే భ‌లే మ‌గాడివో సినిమాతో టాప్ ద‌ర్శ‌కుల జాబితాలో చేరిపోయిన మారుతి…హీరో వెంక‌టేష్ తో తెర‌కెక్కించిన సినిమా బాబు బంగారం. ద‌ర్శ‌కుడు మారుతి మొద‌టిసారి స్టార్ హీరోతో …అది కూడా కామెడీ పండించ‌డంలో దిట్ట అయిన వెంకీతో సినిమా చేయ‌డంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

దీనికి తోడు వెంక‌టేష్ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించ‌డంతో ఈ మూవీకి ఎక్క‌డ లేని క్రేజ్ వ‌చ్చింది.ఈ మూవీఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మరి ఈ సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు అందుకుందా…లేదో చూద్దాం…

కథ :

కృష్ణ‌(వెంక‌టేష్) పోలీసాఫీస‌ర్ . అన్ని తాత బుద్దులే..న తాత లాగే అంద‌రిపై జాలీ చూపిస్తుంటాడు..ఆఖ‌రికి ఖైదీల‌కు ద‌గ్గు..జ‌లుబు చేసిన సాయం చేస్తుంటాడు. అలాంటి కృష్ణకు అనుకోకుండా ఒక రోజు ఐటీ అధికారి హ‌త్య కేసును అప్ప‌గిస్తారు. ఈ కేసును చేదిస్తున్న క్ర‌మంలో శైల‌జ‌(న‌య‌న‌తార) ప‌రిచ‌మైన ప్రేమ‌లో ప‌డ‌తాడు. కృష్ణ పోలీసాఫీస‌ర్ అన్న సంగ‌తి శైల‌జ‌కు తెలియ‌దు. ఇక శైల‌జ‌కు ఐటీ అధికారికి ఉన్న సంబందం ఏమిటీ…కృష్ణ పోలీసాఫీస‌ర్ అని తెలిసిన వెంట‌నే శైల‌జ ఎందుకు దూర‌మ‌వుతుంది…కేసును చేధించే క్ర‌మంలో కృష్ణ‌ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి..? శైల‌జ ప్రేమ‌ను తిరిగి పొందాడా అన్న‌ది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

న‌టీన‌టులు :

సినిమా మొత్తాన్ని వెంకీ త‌న భుజాల‌పై మోశాడు. త‌నదైన కామెడీ పంచుల‌తో బాగా న‌వ్వించాడు. ఫ‌స్టాప్ లో…క్లైమాక్స్ లో వెంకీ చూపించిన వేరియేష‌న్ నిజంగా అద్భుతం. న‌య‌న‌తార పాత్ర‌కు ఎక్కువ ప్రాధాన్యం లేకున్నా ఉన్నం మేర‌లో బాగా న‌టించింది. పాట‌లో చాలా అందంగా క‌నిపించింది. 30 ఇయర్స్ పృథ్వీ ‘బత్తాయి బాబ్జీ’ పాత్రలో చాలా బాగా నవ్వించాడు. అతని కోసం మారుతి రాసుకున్న క్యారెక్టర్ బాగా వర్కవుటైంది. వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, పోసాని అక్క‌డ‌క్క‌డా బాగానే న‌వ్వించారు.

సాంకేతిక విశ్లేష‌ణ

రొటీన్ క‌థ కు కామేడీ ని అద్దాడు ద‌ర్శ‌కుడు మారుతి. సినిమా మొత్తం వెంకీ పాత్ర‌ను బాగానే హైలెట్ చేసిన మిగిలిన పాత్ర‌ల‌ను గాలికొదిలేసిన‌ట్లుగా అనిపించింది. ఇక ఫస్టాఫ్‌ అంతా మంచి కామెడీ సన్నివేశాలతో నడిస్తే, సెకండాఫ్‌కి వచ్చేసరికి కథంతా సీరియస్‌గా మారిపోతుంది. ఘిబ్రాన్ అందించిన సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. దర్శకుడు వెంకటేష్ ను రెండు వేరియేషన్లలో చూపించ‌డం బాగుంది. మొదటి పార్ట్ ను చాలా ఎంటర్టైనింగ్ గా తీసినా సెంకడ్ హాఫ్ మాత్రం సీరియస్ గా సాగింది. సెకండ్ హాఫ్ పెద్దగా కథేమీ లేకపోయినప్పటికీ మంచి కామెడీ డోస్ తో సినిమాని ముగించిన మారుతి పాత వెంకటేష్ ను మళ్ళీ చూపించారు. కెమెరా చూడ చ‌క్క‌గా ఉంది. స్టార్ హీరోని బాగానే డీల్ చేశాడు మారుతి.. వెంక‌టేష్ కూడా త‌న మార్క్ కామెడీతో సినిమాను నిల‌బెట్టాడు.. న‌య‌న‌తార అందం అద‌న‌పు అక‌ర్ష‌ణ‌..

కామెంట్.. బాబు బంగార‌మే

రేటింగ్ః 2.5/5

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -