Sunday, May 19, 2024
- Advertisement -

చిరు, పవన్‌లపై తెలుగులో శ్రీరెడ్డి జర్నలిస్టిక్ వ్యాసాలు…. అడ్డంగా దొరికిపోయారుగా?

- Advertisement -

శ్రీరెడ్డి ఆవేదన సడన్‌గా తెలుగు భాషలోకి మారిపోయింది. అది కూడా జర్నలిస్టులు రాసే శైలిలో వ్యాసాలకు వ్యాసాలు రాసేస్తోంది. చిరంజీవి, పవన్‌లను టార్గెట్ చేస్తూ ప్రొఫెషనల్ జర్నలిస్ట్ రాసిన స్థాయిలో రాసేస్తోంది. నిన్నటివరకూ టెంగ్లీష్, ఇంగ్లీష్‌లకు పరిమితమైన శ్రీరెడ్డి సడన్‌గా తెలుగులో ప్రొఫెషనల్ జర్నలిస్ట్‌ల స్థాయిలో వివరణాత్మక వ్యాసాలు రాసే స్థాయికి ఎలా ఎదిగింది? శ్రీరెడ్డి జర్నలిజం చదివినట్టుగా చెప్పుకోలేదు. తన మాటల్లో కూడా ఆ స్థాయి తెలివితేటలు, జర్నలిజం శైలి కనిపించలేదు. మరి సడన్‌గా చిరంజీవి, పవన్‌లపై పేజీలకు పేజీలు వ్యాసాలు రాసే స్థాయికి శ్రీరెడ్డి ఎలా ఎదిగింది?

ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఆ వ్యాసంలోనే కనిపిస్తోంది. చంద్రబాబు, లోకేష్‌లతో సహా టిడిపి నాయకులందరికీ కూడా వాళ్ళ ప్రసంగ పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయో అందరికీ తెలుసు. ఇప్పుడు శ్రీరెడ్డికి కూడా అదే స్థానం నుంచే వచ్చాయి. అన్నింటికీ మించి అసలు శ్రీరెడ్డి సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా బాబు భజన బృందంలో ప్రధాన సభ్యుడైన ఆ మీడియా అధినేతనే మెయింటెయిన్ చేస్తున్నాడా అన్న అనుమానాలు జర్నలిస్ట్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఎందుకంటే వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలన్నీ కూడా ఆయన మీడియా సంస్థలో పనిచేసే జర్నలిస్టులతో ఆ మీడియా అధినేత షేర్ చేసుకుంటున్న విషయాలే కావడం అలాంటి అనుమానాలు రేకెత్తిస్తోంది. ఆ మీడియా అధినేత వారాంతపు కామెంట్స్ శైలికి…….శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ అవుతున్న వ్యాసాల రచనా శైలికి చాలా దగ్గరగా ఉండడాన్ని సీనియర్ జర్నలిస్టులు ఎత్తి చూపుతున్నారు. ఆ మీడియా అధినేత నోటీ మాటగా చెప్పే మాటలను ఎవరైతే వ్యాసంగా రాస్తున్నారో….అదే కాంపౌండ్ నుంచి అదే జర్నలిస్ట్ రాసిన శైలిలోనే చిరు, పవన్‌లపై శ్రీరెడ్డి రాసిన వ్యాసాల రచనా శైలి కూడా ఉండడం తెరవెనుక మీడియా దొరలు అడ్డంగా దొరికిపోయేలా చేస్తోంది. ముందు ముందు అయినా ఇలాంటి తప్పులు దొర్లకుండా……అడ్డంగా దొరికిపోకుండా జాగ్రత్తపడతారేమో చూడాలి.

అయినా కొత్త నాయకుడు రంగప్రవేశం చేసినప్పుడు డైరెక్ట్‌గా యుద్ధం చేయాలంటే టిడిపి అధినేతకు ఎందుకంత భయం? శిఖండులను అడ్డుపెట్టుకోవడం, కోవర్టులతో వెన్నుపోటు రాజకీయాలు చేయడం ఏం రాజకీయం అన్న చర్చ ఇప్పుడు తెలుగునాట ప్రధానంగా నడుస్తోంది. ముందు ముందు ఉన్న ఇమేజ్ కూడా పోకుండా ఉండాలంటే ఇలాంటి తెరవెనుక డ్రామాలను ఆపేస్తేనే మంచిది అని రాజకీయ విమర్శకులు సలహా ఇస్తున్నారు. అయినా వెన్నుపోటు రాజకీయాలను ఆపే అవకాశం ఉందంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -