Thursday, May 16, 2024
- Advertisement -

సినిమాల్లో న‌టించాలంటే `ఆ ప‌ని` చేయాల్సిందేనా?

- Advertisement -

భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌లో టాలీవుడ్ పాత్ర పెద్ద‌దే. బాలీవుడ్ త‌ర్వాత పెద్ద ఇండ‌స్ట్రీ తెలుగుదే. దేశంలోనే రెండో అతిపెద్ద ఇండస్ట్రీగా పేరు పొందుతున్న టాలీవుడ్‌కు కొన్ని మ‌చ్చ‌లు అప‌ఖ్యాతీ తీసుకొస్తున్నాయి. టాలీవుడ్‌లో ఒక సంవ‌త్స‌రంలో కనీసం 150 సినిమాలు వ‌స్తుంటాయి. దాదాపు రూ.వెయ్యి కోట్ల మార్కెట్ ఉన్న ప‌రిశ్ర‌మ‌కు కొన్ని ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి. అది హీరోయిన్ల విష‌యంలోనే. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాల కోసం.. లేదా ఎంట్రీ కోసం.. పెద్ద పెద్ద సినిమాల్లో పాత్ర‌ల కోసం ఇలా దేనికోస‌మైనా హీరోయిన్ల‌ను వాడుకుంటున్నార‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

తెలుగు సినిమాలో అవ‌కాశాల కోసం హీరోలు, నిర్మాత‌ల వ‌ద్ద ఆ ప‌ని చేయాల‌ని.. లేదా త‌మ‌ను తాము అర్పించుకోవాల‌ని.. లేదా త‌మ‌కు కావాల్సినది ఇవ్వాలి అని ఇటీవ‌ల ప‌లువురు న‌టీమ‌ణులు ఆరోపిస్తున్నారు. ఈ మధ్య హీరోయిన్లు మాత్రం టాలీవుడ్ ప‌రువును తీసేస్తున్నారు. టాలీవుడ్‌ను తిట్టేసి వేరే వుడ్‌కు వెళ్తున్నారు. అర డజన్ హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీ గురించి బ్యాడ్‌గా మాట్లాడారు. ఇక్కడి హీరోలపై సంచ‌ల‌న‌ ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే ప‌దం లేదా ప‌ద్ధ‌తి ఉంది. అంటే అవకాశాల కోసం హీరోయిన్లను శారీరకంగా వాడుకోవ‌డం అనే అర్థం ఉంది. ఎవ‌రెవ‌రె ఏమేమి ఆరోప‌ణ‌లు చేశారో చ‌ద‌వండి.

కస్తూరి: తెలుగు ఇండస్ట్రీలో ఓ హీరో పడకగదికి రమ్మన్నాడు. ఆ హీరో ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాడు. అన్నమయ్య సినిమాతో బాగా పాపులర్ అయిన ఈమెకు అవ‌కాశాల రాలేదు. తాను లొంగనందుకు అవకాశాలు రాకుండా చేశాడ‌ని ఆరోపించింది.
శృతిహరిహరన్: తెలుగులో హీరోయిన్లు తమను సమర్పించుకోకపోతే నెగ్గుకురాలేరు.
రాధిక ఆప్టే: టాలీవుడ్ హీరోలకు మర్యాదే తెలియదు.
మాధవీలత: తెలుగులో అవకాశాల కోసం పడుకోక తప్పదు. వీరితో పాటు తాప్సీ కూడా ఆరోప‌ణ‌లు చేసింది. మొన్న రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా తిట్టేసి బాలీవుడ్‌కు వెళ్లింది.

ఇలా చిన్న హీరోయిన్ల నోటి నుంచి ఇలాంటి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మ‌రీ స్టార్ హీరోయిన్లుగా ఉన్నవారంతా దానికి ఒప్పుకునే ఇంత రాణిస్తున్నారా అనే డౌట్ వ‌స్తుంది. ఈ ఆరోప‌ణ‌ల‌పై మాత్రం ఆ స్టార్ హీరోయిన్లు చ‌డీచ‌ప్పుడు లేకుండా ప‌ని చేసుకుంటున్నారు. అయినా నిప్పు లేనిదే పొగ రాదు మాదిరిగా వాస్త‌వం కాకుంటే ఆరోప‌ణ‌లు ఎలా వ‌స్తాయి. ఒక‌వేళ ఈ ప‌రిస్థితి ఉంటే మారాల్సిందే. లేదంటే టాలీవుడ్‌కు అప‌ఖ్యాతి మూట‌గ‌ట్టుకొని ప‌రువు బ‌జారున ప‌డుతుంది. ఎంతో మంది న‌మ్ముకొని జీవిస్తున్న క‌ళామ త‌ల్లి క‌న్నీళ్లు పెట్టే దుస్థితి వస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -