Friday, May 17, 2024
- Advertisement -

‘కత్తిలాంటోడు’ డైలాగ్స్ లీకయ్యాయి!

- Advertisement -

ఓ చిత్రం సెట్స్ మీద ఉండగానే ఆ చిత్రానికి సంబంధింది ఏదో ఒకటి లీక్ అవుతూ ఉంటాయి. ఫోటోలు, సాంగ్స్, డైలాగ్స్, స్టోరి లైన్ ఇలా ఎన్నో లీక్ అవుతుంటాయి. ఇక టాప్ హీరోల సినిమాలకు అయితే ఈ సమస్య పెద్దగానే ఉంటుంది. ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి 150వ చిత్రాన్నికి కూడా లీకేజ్ సమస్య ఎదురైయింది.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ సినిమాని తెలుగులో చిరు రీమేక్ చేస్తున్న సంగతీ తెలిసిందే. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా హీరోయిన్ ఫీక్స్ చేయని ఈ సినిమాకి ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటివలే ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యింది. అయితే ఈ చిత్రం కోసం  ఆకుల శివ రాసిన డైలాగ్స్ కొన్ని లీకయ్యాయి. ఆ డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. 

* దుక్కి దున్నడమే తెలుసు వీళ్ళకు (రైతులకు).. దుర్మార్గం చెయ్యడం తెలియదు..

* నాగలి పట్టడమే తెలుసు వీళ్ళకు – నరకడం తెలియదు..

* కానీ ఇప్పుడు మీరు వీళ్ళ పొలాలకు నీరు ఇవ్వకపోతే.. ఆ నాగలి పట్టిన చేతులే మీలాంటి కలుపు మొక్కలను నరుకుతూ మీ గుండెలను దున్నుకుపోతారు.

రైతులను ఉద్దేశించి చిరు చెప్పే ఈ డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ డైలాగ్స్ చిరు నోట వింటే థియేటర్లలో విజిల్సే. ఇక ఈ సినిమాని  ‘కొణిదెల హోం ప్రొడక్షన్స్’పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

Related 

  1. కత్తిలాంటోడు సినిమా ఫస్ట్ టీజర్??
  2. కత్తి కథ గొడవ!
  3. కత్తిలాంటోడు పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది!
  4. Exclusive: కత్తి కథపై మరో పెద్ద వివాదం..!
  5. ‘కత్తి’ చిత్రం రీమేక్‌లో చిరంజీవి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -