Thursday, May 9, 2024
- Advertisement -

పాపం దేవినేని.. అంత త్యాగం చేశారట

- Advertisement -

ఆంధ్రా ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తీవ్రంగా నొచ్చుకున్నట్టున్నారు. అందుకే.. హైదరాబాద్ నుంచి కాకుండా.. విజయవాడ నుంచే తన శాఖ కార్యాక్రమాలు నిర్వహించారు. ఈ విషయంపై ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న ఉమ.. ఈ మధ్యే కొన్ని కొత్త విషయాలు చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ నుంచి ఉద్యోగులు అమరావతి వచ్చేస్తుంటే తనకు ఆనందంగా ఉందన్న ఉమ.. అదే సందర్భంలో తను చేసిన ఓ త్యాగాన్ని ఉద్యోగులకు వివరించారు. విభజన తర్వాత.. ఓ దశలో సీఎంకు ఆఫీస్ లేకుంటే.. తన కార్యాలయాన్ని ఇచ్చేశానని దేవినేని ఉమ.. ఉద్యోగులకు చెప్పారు. చాలా ఇబ్బందుల మధ్య కనీసం ఆఫీస్ కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్రం కోసం పనిచేశామన్నారు. తన శాఖ సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు.. తానే ఉదయం 8 గంటల నుంచే పొలం గట్ల మధ్యలో తిరిగినట్టు గుర్తు చేసుకున్నారు. మనది కాని రాష్ట్రంలో ఉండొద్దన్న అభిప్రాయంతోనే.. హైదరాబాద్ ను వదిలి విజయవాడలో పని చేసుకుంటున్నట్టు ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు.

ప్రభుత్వ పరంగా తాము ఇబ్బంది పడినా.. ఉద్యోగుల విషయంలో మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు దేవినేని చెప్పారు. అన్ని శాఖల వారికీ.. అన్ని సౌకర్యాలు కలిగించాకే.. హైదరాబాద్ నుంచి ఉద్యోగుల తరలింపు పని మొదలు పెట్టినట్టు వివరించారు. ఉద్యోగులంతా ఆంధ్రాకు తరలివస్తుంటే.. ఆనందంగా ఉందని పొంగిపోయారు. అదీ సంగతి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -