మీటూ ఉద్యమం సర్థుమణిగింది అనుకునేలోపే ఎవరో ఒకరు దీనిపై స్పందిస్తు వార్తల్లో నిలుస్తున్నారు.టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ #మీటూ ఉద్యమం ఉదృతంగా సాగింది.ఇండస్ట్రీలో తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి కొందరు మహిళలు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.తాజాగా మరోనటి తను ఫేస్ చేసిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది.మలయాళ నటి గాయత్రి అరుణ్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ లో ఆమె ఎదుర్కొన్న వేధింపుల గురించి వెల్లడించింది.
రోహన్ అనే కుర్రాడు తన కోరిక తీరిస్తే గంటకు 2 లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడట.అతని చాట్‌ని తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది గాయత్రి అరుణ్.ఈ విషయం ఎవరికి చెప్పనని ,మన మధ్యలోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు ఆ కుర్రాడు.ఈ విషయాలను బయటపెట్టిన గాయత్రి అరుణ్.. మీ అమ్మ, సోదరిల భద్రత కోసం దేవుడ్ని ప్రార్ధిస్తుంటానని పోస్ట్ పెట్టింది. గాయత్రి అరుణ్ చేసిన పనికి ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఎత్తున మద్దతు లభిస్తుంది.ఆ కుర్రాడు మైనర్ కావడం,వారి తల్లిదండ్రులు క్షమాపణ చెప్పడంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది గాయత్రి అరుణ్.
- ‘ది ప్యారడైజ్’ మూవీ ట్రైలర్.. నాని కీలక ప్రకటన!
- యుద్ధాన్ని ఆపండి.. పుతిన్‌తో ప్రధాని మోదీ
- అసాంఘిక కార్యకలాపాలు.. రంగంలోకి దిగిన ఎస్ఐ మౌనిక!
- కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చా!
- తమిళనాడు రాజకీయాల్లో సంచలనం!
