Saturday, May 18, 2024
- Advertisement -

బాబు, కెసీఆర్‌లను పొగడాలని ఆత్రపడే భజనసేనుడు తప్ప పవన్‌లో నాయకుడు ఎక్కడ?

- Advertisement -

అభిమానులేమో పవన్ ముందుండి నడిపించాలనుకుంటారు….. రాజకీయాలను శాసించాలనుకుంటారు. రాజకీయాల్లో కూడా హీరోగానే నిలబడాలని కోరుకుంటూ ఉంటారు. ప్రజల కోసం పోరాడడానికి వచ్చిన ఒక భగత్ సింగ్, చేగువేరాలాగా పవన్ నిలబడాలన్నది ఆయన అభిమానుల కోరిక. పవన్ కళ్యాణ్ కూడా తన మాటల్లో పోరాటం, ప్రాణ త్యాగం లాంటి మాటలు తరచుగా వినిపిస్తూనే ఉంటాడు. కానీ అన్నీ కూడా సోది మాటలే. ఆయన చేతలు చూస్తున్నవాళ్ళకు మాత్రం అసలు పవన్ కళ్యాణ్‌కి పోరాటం అంటే ఏంటో తెలుసా అన్న అనుమానం వస్తుంది. అధికారంలో ఉన్న చంద్రబాబు, కెసీఆర్‌లను ఎప్పుడెప్పుడు పొగుడుదాం అన్న ఆత్రం తప్ప పవన్‌లో ఇంకేమీ కనిపించదు. కెసీఆర్ అంటే భయమో….. లేక తెరవెనుక ప్యాకేజీ వ్యవహారాలు ఎంత బలంగా ఉన్నాయో తెలియదు కానీ కల్వకుంట్ల కుటుంబం మొత్తాన్ని పొగిడే అవకాశం కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడు పవన్. పుష్కర ప్రమాదం, ఓటుకు కోట్లు కేసు, కాల్ మనీ సెక్స్ రాకెట్ లాంటి విషయాలపై స్పందించడానికి టైం లేదన్నట్టుగా వ్యవహరించిన ఈ భజనసేనుడు కెసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఎవరిని పొగిడే అవకాశం వచ్చినా వెంటనే అలర్ట్ అయిపోతాడు. కవితతో సహా ఎవ్వరూ కూడా పవన్‌కి కనీస స్థాయి రెస్పాన్స్ కూడా ఇవ్వరు. కానీ పవన్ మాత్రం వాళ్ళను పొగడడానికి రెడీగా ఉంటాడు.

ఇప్పటి వరకూ రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు అందరూ కూడా ప్రజలకు ఏదో ఒకటి చేస్తామని వచ్చినవాళ్ళే. కానీ పవన్ ఒక్కడూ మాత్రం వెరైటీ. అంతా కూడా స్టార్ హోటల్స్, ఫాం హౌస్‌ వ్యవహారాల్లా ఉంటాయి. చివరి బడ్జెట్‌లో కూడా చిప్ప చూపించాక….జేఏసీ అని, పోరాటం అని ప్రగల్భాలు పలికిన పవన్ ఒక్క రోజులోనే మాట మార్చి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అన్నాడు. ఈ కమిటీ అయితే స్టార్ హోటల్‌లో కూర్చుని టిడిపి భజన మీడియాలో ఏదో చించేస్తున్నాడని ప్రచారం చేయించుకోవచ్చు మరి. 14రోజులు అజ్ఙాతంలో ఉండి చంద్రబాబు చేసింది కూడా అదేగా.

ఇక తాజాగా కూడా కెసీఆర్ థర్డ్ ఫ్రంట్ అనగానే జై అనేశాడు పవన్ కళ్యాణ్. మోడీకి వ్యతిరేకంగా అన్నాడు కాబట్టే కెసీఆర్‌కి పవన్ జై కొట్టాడని పవన్ అభిమానులు సమర్థించుకుంటున్నారు కానీ పవన్ వ్యవహారాలను పరిశీలిస్తున్నవాళ్ళకు మాత్రం కల్వకుంట్ల కుటుంబంతో సన్నిహితంగా ఉండడం కోసం పవన్ ఆత్రపడుతున్న విషయం తెలుస్తూనే ఉంది. ఇదే విషయాన్ని హ్యాపీడేస్ హీరో వంశీ ఛాగంటి కూడా ప్రశ్నించాడు. కెసీఆర్‌కి జై కొట్టడానికి పవన్ చూపించిన ఆత్రంపై సెటైరికల్‌గా మాట్లాడేశాడు. అధికారంలో ఉన్నవాళ్ళ గుడ్ లుక్స్ కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళో చెప్పాల్సిన అసవరం లేదు. కెసీఆర్‌ని స్మార్ట్ సిఎం అని పొగిడి ఆల్రెడీ అజ్ఙాతవాసికి గట్టి రాయితీలే తెచ్చుకున్నాడు పవన్. ఏంటో పవన్ వ్యవహారం………….రాజకీయాల్లోకి వచ్చి పోరాటాలు చేస్తాడని……చేగువేరా అవుతాడని…..ఏదేదో చేస్తాడని అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకుంటూ ఉంటే………ఆయన మాత్రం రోజు రోజుకూ భజనసేనుడిగా గొప్ప పేరు తెచ్చుకుంటూ చివరకు పొలిటికల్ బఫూన్‌లో మిగిలిపోయేలా కనిపిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -