Sunday, May 19, 2024
- Advertisement -

ఫిబ్రవరి 26 న ‘యమపాశం’

- Advertisement -

తమిళ్ లో ఇప్పటి వరకూ రాని జాంబీ ( నడుస్తున్న శవాలు ) కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘ మిరుతన్ ‘ సినిమా తెలుగులో ‘యమపాశం ‘ పేరుతో రాబోతోంది. జయం రవి, లక్ష్మీ మీనన్ జంటగా యాక్ట్ చేసిన ఈ సినిమా మామగారు, బావ బావమరిది, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయస్తుడైన ఎడిటర్ మోహన్ తనయుడు  జయం రవి , లక్ష్మి మీనన్  ముఖ్య పాత్రలలో  నటించి  తమిళనాట  “మిరుతన్ “   గా  రిలీజ్ అయ్యి  సంచలన విజయం సొంతం చేసుకొని ఇప్పుడు  తెలుగు ప్రేక్షకుల ముందుట ఫిబ్రవరి 26 న ఈ సినిమా విడుదల కానుంది.

శక్తి సౌందర్ రాజన్ తీసిన ఈ జాంబీ మూవీ, ఈ జానర్ లో సౌత్ ఇండియాలోనే మొదటిది కావడం విశేషం. ఇప్పటి వరకూ హాలీవుడ్ లో మాత్రమే ఈ తరహా చిత్రాలు వచ్చేవి. ఒక వైరస్ ప్రపంచమంతా వ్యాపించి, మనుషుల్ని నరమాంస భక్షకులుగా మార్చేస్తే, ఆ వైరస్ నుంచి మిగిలిన వాళ్లను కాపాడటమెలా అనేదే జాంబీ కథాంశం. హాలీవుడ్ వాళ్లకు ఇవి రొటీన్ అయిపోయినా, ఇండియాకు 

మాత్రం ఇవి కొత్తే..ఈ సందర్భం గ  హీరో  జయం రవి మాట్లాడుతూ …ఓ సైంటిఫిక్‌ వైరస్‌ వల్ల మనుషుల్లో ఎలాంటి పరిణామాలు వస్తాయి అనే విభిన్నమైన కాన్సెప్ట్‌ తో తెరకెక్కింది యమపాశం . ఈ సినిమా ఏ భాషలోనైనా హిట్టవుతుందనే నమ్మకంతోనే తెలుగులోకి తిసుకోస్తన్నాం … తెలుగు మొట్టమొదటి సారిగా యమపాశం సినిమా ద్వారా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని దీనికి తప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ మరియు మీడియా సహకారం కావాలని కోరుకుంటున్నాని తెలిపారు. మరి ఫిబ్రవరి 26 న  రిలీజ్ కాబోతున్న జయం రవి “యమ పాశం “ సినిమా  తో తెలుగు ప్రేక్షకుల ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -