Saturday, May 18, 2024
- Advertisement -

మహేష్ వర్సెస్ బన్నీ…….. సేం ఓల్డ్ మెగా కుట్రలు షురూ

- Advertisement -

తమిళ సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేని చాలా మంది హీరోలుగా నిలదొక్కుకుంటూ ఉంటారు. అలాగే వైవిధ్యమైన సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. అదే తెలుగులో ఆ పరిస్థితి ఉండదు. ఎందుకని? ఎందుకంటే అక్కడ సూపర్ స్టార్‌గా తమిళ ఇండస్ట్రీని శాసిస్తున్న రజినీకాంత్ ఇతరులను కూడా ఎదగనిస్తాడు. తన సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాడు. అంతే కానీ ఇతరుల సినిమాలు ఆడకూడదని కానీ, ఆడకుండా చేయాలన్న ప్రయత్నాలు కానీ ఎప్పుడూ చేయడు. అలాగే తన అభిమానులు కూడా ఇతర హీరోల విషయంలో మరీ ద్వేషంతో ఉండాలని కోరుకోడు. ఇతర విషయాల్లో ఎన్ని లోపాలు ఉన్నా ఈ విషయంలో మాత్రం రజినీకాంత్ చాలా గొప్పగా వ్యవహరించాడు. అదే తెలుగు విషయానికి వస్తే మామూలు మెగా అభిమానుల విషయం పక్కనపెడితే హార్డ్ కోర్ మెగా అభిమానులు, పవన్ హార్డ్ కోర్ అభిమానులు మాత్రం ఇతర హీరోల సినిమాల విషయంలో కొన్ని సార్లు క్రూరంగా వ్యవహరిస్తారు. అభిమానులు అలా చేసేలా తెరవెనుక అసలు వారే ప్రోత్సహిస్తూ ఉంటారని తెలుగు సినిమాను దగ్గరగా చూస్తున్న సీనియర్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక మెగా అభిమానులతో పాటు ఒక కులం హీరోల కొందరు అభిమానులు కూడా అమానవీయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రొడ్యూసర్స్‌కి దాదాపు పది కోట్లు నష్టం తెచ్చిపెట్టిన ఒక సినిమాను లెజెండరీ హిట్ అనీ, సంవత్సరాల తరబడి ఆడేసిందని మూర్ఖంగా వాదించే జనాలు ఇతర హీరోల సినిమాలను మాత్రం తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు.

బిజినెస్, రిలీజ్ వ్యవహారాలన్నీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది చేతుల్లోనే ఉంటాయన్నది నిజం. ఇక పదకొండు మంది హీరోలను చేతిలో ఉంచుకున్న అల్లు అరవింద్ హవా అంతా ఇంతా కాదు. ఇక మిగిలిన వాళ్ళు కూడా వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళే. అందుకే చాలా చిన్న సినిమాలు, మంచి సినిమాలు జనాల వరకూ చేరకుండానే బలయిపోతున్న పరిస్థితి. ఇక సొంత కుటుంబ హీరోల సినిమాలను మాత్రం బాగా లేకున్నా కూడా జనాలపైన రుద్దే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉంటారు. ఆ మధ్య అల్లు శిరీష్ సినిమాను కూడా అలానే ఆడించారన్న ప్రచారం ఉంది. ఇక ఇప్పుడు మహేష్ సినిమా భరత్ అను నేనుతో పోటీ పడుతున్న అల్లు అర్జున్ నా పేరు సూర్య……నా ఇల్లు ఇండియా కోసం కూడా తెరవెనుక రాజకీయాలు షురూ అయ్యాయని తెలుస్తోంది. ముందుగానే చాలా తెలివిగా రిలీజ్ డేట్‌ని ఒక రోజు ముందుకు జరిపారు. ఎక్కడికక్కడ థియేటర్స్‌ని బ్లాక్ చేస్తున్నారు. టాప్ రేంజ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ విషయంలో మెగా క్యాంప్‌కే సహకరిస్తున్నారు. పదకొండు మంది మెగా హీరోలు ఉన్నారు మరి. నంబర్ ఒన్ రేసులో గట్టి పోటీదారుగా ఉన్న మహేష్ సినిమాతో ఢీకొట్టాలనుకోవడం వరకూ అల్లు అర్జున్‌ని మెచ్చుకోవచ్చు. కానీ ఇలా తెరవెనుక వ్యవహారాలకు పాల్పడి గెలవాలనుకోవడం మాత్రం మంచిది కాదని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మోహన్‌బాబు పక్కనుండగా…..చిరంజీవి సమక్షంలోనే ఆ మధ్య రజినీకాంత్ ఓ మాట చెప్పాడు. ‘తన సినిమా ఒక్కటే ఆడాలి……..మిగిలిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వాలి అనుకునేవాడు జీరో. తన సినిమాతో పాటు అన్ని సినిమాలూ హిట్ అవ్వాలని కోరుకునేవాడు హీరో’అని. ఒకసారి రజినీ డైలాగ్ మళ్ళీ గుర్తు చేసుకుంటే బెటరేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -