Sunday, May 19, 2024
- Advertisement -

మ‌హ‌ర్షి దెబ్బ‌కు నాన్ బాహుబ‌లి రికార్డులు బ‌ద్ద‌లు ..మొద‌టిరోజు క‌లెక్స‌న్లు ఎంతంటె..?

- Advertisement -

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా రూపొందిన ‘మహర్షి’ నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రం బాక్సాఫీసు వద్ద తొలిరోజు వసూళ్ల వరద పారించింది. నైజాంతో పాటు పాటు పలు ఏరియాల్లో విధ్వంసకర వసూళ్లు సాధిస్తూ నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టింది. వేసవి సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. నైజామ్ .. కృష్ణా .. గుంటూరు ఏరియాల్లో తొలిరోజున ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోయింది.

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ‘మహర్షి’ మూవీ విడుదలైన అన్ని ఏరియాల్లో 100శాతం ఆక్యుపెన్సీ సాధించింది.ప్రత్యేక షోలు, బెనిఫిట్ షోలు వేసినప్పటికీ అభిమానుల తాకిడికి థియేటర్లు కిక్కిరిసిపోయాయి.నైజామ్ లో ఈ సినిమా 6.38 కోట్లను రాబట్టి, ‘బాహుబలి’ పేరున వున్న రికార్డును చెరిపేసి ‘బాహుబలి 2’ తరువాత స్థానంలో నిలిచింది. కృష్ణా ఏరియాలో 1.39 కోట్ల షేర్ ను వసూలు చేసి ‘భరత్ అనే నేను’ వసూళ్లను క్రాస్ చేసింది. ఇక ‘గుంటూరు’ ఏరియాలో 4.40 కోట్ల వసూళ్లను రాబట్టి, ‘వినయ విధేయ రామ’ వసూళ్లను అధిగమించింది. దీంతో బాహుబలి 2 మినహా ఇప్పటి వరకు నైజాం ఏరియాలో ఉన్న రికార్డులన్నీ బద్దలయ్యాయి.

బాహుబలి 2 మూవీ రూ. 8.92 కోట్ల తొలి రోజు షేర్ సాధించి నైజాం ఏరియాలో నెం.1 స్థానంలో కొనసాగుతోంది. దీని తర్వాతి స్థానంలో బాహుబలి 1(రూ. 6.29 కోట్లు) ఉండగా… ఆ స్థానాన్ని ఇపుడు ‘మహర్షి’ ఆక్రమించింది. ఎన్టీఆర్ మూవీ ‘అరవింద సమేత'(రూ. 5.77 కోట్లు)తో తర్వాతి స్థానంలో ఉంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -