Saturday, May 18, 2024
- Advertisement -

‘నా పేరు సూర్య’ మూవీ రివ్యూ

- Advertisement -

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్‌ మేకోవర్‌లో.. డిఫరెంట్‌ మేనరిజమ్స్‌తో సోల్జర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్‌, సాంగ్స్ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేశాయి. మరి ఆ అంచనాలను నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అందుకుందా.? వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న బన్నీ మరోసారి తన స్టామినా ప్రూవ్‌ చేసుకున్నాడా..? ఎన్నో విజయవంతమైన కథలు అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా తొలి ప్రయత్నంలో విజయం సాధించాడా..?

స్టోరీ: సూర్య (అల్లు అర్జున్‌) కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేని యువకుడు. తన ఆవేశంతో ప్రతీ ఒకరితో గొడవపడుతూ ఉంటాడు. చిన్నతనంలో ఓ గొడవ కారణంగా ఇంట్లోంచి వెళ్లిపోతాడు. పెద్దయ్యాక సైన్యంలో చేరి అక్కడా తన తీరును మార్చుకోడు. ఈ క్రమంలో ఓ మినిస్టర్‌ కొడుకుతో గొడవపడటం, తరువాత ఆర్మీ నిర్భందంలో ఉన్న ఓ వ్యక్తిని చంపటంతో ఉన్నతాధికారులు సూర్య మీద చర్యలు తీసుకుంటారు. తన మీద తనకు కంట్రోల్‌ లేని వాడు సైన్యంలో పనికిరాడంటూ ఆర్మీ నుంచి సస్పెండ్‌ చేస్తారు. తిరిగి ఆర్మీలో చేరాలంటే తాను మానసికంగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రముఖ సైకాలజిస్ట్‌ రామకృష్ణం రాజు (అర్జున్‌) నుంచి సర్టిఫికేట్‌ తీసుకురావాలని కండిషన్‌ పెడతారు. ఆ పని మీద వైజాగ్‌ వచ్చిన సూర్యకు సమస్యలు ఎదురవుతుంటాయి.

నటీనటులు : అల్లు అర్జున్‌ గతంలో ఎన్నడూ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించాడు. యాంగ్రీ యంగ్‌మెన్‌గా మంచి నటన కనబరిచాడు. కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేని యువకుడిగా.. అదే సమయంలో దేశం కోసం ప్రాణమిచ్చే దేశ భక్తుడి షేడ్స్‌లో ఆకట్టుకున్నాడు. రొమాంటిక్‌ సీన్స్‌ లోనూ తన మార్క్‌ చూపించాడు. బన్నీ స్టైలిష్‌ డాన్స్‌ మూమెంట్స్‌ సినిమాకు హైలెట్‌ గా నిలిచాయి. యాక్షన్‌ సీన్స్‌లోనూ బన్నీ పడిన కష్టం తెర మీద కనిపించింది.హీరోయిన్‌గా వర్ష పాత్రలో అనూ ఇమ్మాన్యూల్‌ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఉన్నంతలో నటనతో పాటు గ్లామర్‌ షోతోనూ అలరించింది. రామకృష్ణంరాజు పాత్రలో నటించిన సీనియర్‌ నటుడు అర్జున్‌ సెటిల్డ్‌ ఫెర్ఫామెన్స్‌ తో ఆకట్టుకున్నారు. స్టైలిష్‌గా కనిపించిన అర్జున్‌ తన పాత్రలో ఒదిగిపోయారు. శరత్‌ కుమార్‌ తనకు అలవాటైన ఎగ్రెసివ్‌ రోల్‌ లో మరోసారి మెప్పించాడు.

విశ్లేషణ : సూపర్‌ హిట్ కథలు అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా తొలి ప్రయత్నంలో డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను అభిమానులకు డిఫరెంట్ మేకోవర్‌లో చూపించాడు. లుక్‌ పరంగానే కాదు బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్‌ ఇలా ప్రతీ విషయంలోనూ బన్నీని కొత్తగా చూపించాడు దర్శకుడు. మొదటి నుంచి సినిమాను దేశభక్తి సినిమాగా ప్రమోట్‌ చేసినా రొమాన్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అయితే తొలి భాగాన్ని ఆసక్తికరంగా నడిపించిన వంశీ, ద్వితీయార్థంలో మాత్రం కాస్త తడబడ్డాడు. సెకండ్‌ హాఫ్‌ కథనం కాస్త నెమ్మదించటం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. ప్రేమకథను కూడా అంత ఆసక్తికరంగా మలచలేదు. క్లైమాక్స్‌ విషయంలోనూ ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.సరిహద్దులో శత్రువుల కంటే.. దేశం లోపల ఉన్న దుష్టశక్తులు ప్రమాదకరమని భావించి వాటితో పోరాటం చేసే ఆవేశపరుడైన సైనికుడి కథే ఇది. అయితే తొలి ప్రయత్నంలో బలమైన కథను రాసుకున్న దర్శకుడు వక్కంతం వంశీ.. దానిని తెరపై మాత్రం అంత ఆసక్తికరంగా మలచలేకపోయాడు.

అల్లు అర్జున్ నా పేరు సూర్య ట్వీట్ట‌ర్ రివ్యూ

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -