Sunday, May 5, 2024
- Advertisement -

అజ్ఙాతవాసి బాటలోనే జైసింహా కూడా….. మరో సంక్రాంతి ఫట్

- Advertisement -

ఆకాశాన్ని అందుకున్న స్థాయి అంచనాలతో…….పవన్ ఫ్యాన్స్ భారీ హంగామా మధ్య థియేటర్స్‌లో అడుగుపెట్టిన అజ్ఙాతవాసి రెండు రోజులకే ఉసూరనిపించాడు. రాజకీయ భజన చేసి మరీ తెచ్చుకున్న ఎగస్ట్రా షోలు ఎందుకూ కొరగాకుండాపోయాయి. రెండో రోజునే మరీ తక్కువ సంఖ్యలో కూడా టిక్కెట్లు అమ్ముడుపోలేదని షోలు కేన్సిల్ చేసిన పరిస్థితి. అజ్ఙాతవాసి విషయం అలా ఉంటే ఇప్పుడిక జై సింహా థియేటర్స్‌లోకి వచ్చాడు. భజనసేనుడి సినిమాకు ఇచ్చిన సౌకర్యాలన్నింటినీ తన బావమరిది సినిమాకు కూడా ఇచ్చేశాడు చంద్రబాబు. అందుకే జైసింహా కూడా భారీగానే రిలీజ్ అయింది. టైటిల్‌లో సింహా ఉండడం, బాలయ్యకు గతంలో సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ ఉండడంతో ఈ సినిమాపైన కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకుందా?

జైసింహా సినిమా మొదలైన పదినిమిషాలకే చూస్తున్న ప్రేక్షకులకు ఒక విషయం అర్థమవుతుంది. మనం కొత్త సినిమా చూస్తున్నాం అని ఫీలవడానికి ఏమీ లేదు అన్న విషయం అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా బ్రహ్మానందం లాంటి అవుట్ డేటెడ్ కమెడియన్స్‌తో అంతకంటే అవుట్ డేటెడ్ ఎనభైల నాటి కామెడీ సీన్స్‌తో సాగుతుంది. ఎక్కడా కూడా ఇంప్రెసివ్‌గా అనిపించే సీన్ ఒక్కటి కూడా ఉండదు. అయితే బాలయ్య డ్యాన్సులు మాత్రం ఫ్యాన్స్‌ని అలరిస్తాయి. డ్యాన్స్‌ల విషయంలో బాలయ్య మరోసారి మెప్పించగలిగాడు. అయితే బాలకృష్ణ విగ్గు, మేకప్ మాత్రం మరీ ఇబ్బందిగా ఉంటుంది. అలాగే కుర్ర హీరోయిన్‌తో బాలయ్య సరదాలు, సరసాలు కూడా ఆయన ఫ్యాన్స్‌కి నచ్చుతాయేమోకానీ ఎక్కువ మంది ప్రేక్షకులను మాత్రం ఇరిటేట్ చేస్తాయి.

ఇక షరామామూలుగానే ఒక భారీ హీరోయిజం సీన్‌తో ఇంటర్వెల్‌కి వచ్చే జైసింహా ……ఇంటర్వెల్ తర్వాత యాక్షన్ మోడ్‌లో ఇరగదీస్తాడేమో అన్న ఆశ కల్పిస్తాడు. అయితే డైరెక్టర్ కెఎస్ రవికుమార్ మాత్రం ఇంటర్వెల్ తర్వాత నుంచీ ఎనభైల నాటి టీవీ సీరియల్ సెంటిమెంట్ సీన్స్‌తో కథనం నడిపిస్తాడు. రజినీకాంత్ నటించిన ముత్తు సినిమా తరహాలో బాలయ్య త్యాగపూరిత సెంటిమెంట్ సీన్స్ ఈ తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఛాన్సే లేకుండా పోయింది. ఆ రకంగా సెకండ్ హాఫ్‌లో కూడా ప్రేక్షకులను మెప్పించడానికి ఏమీ లేకుండా పోయింది. అయితే మరీ రొటీన్ మాస్ మసాల సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం కొంతమేర ఈ సినిమా నచ్చొచ్చు. అంతకుమించి అర్జున్‌రెడ్డి, ఫిదాలాంటి సినిమాలు ఇష్టపడిన ప్రేక్షకులు మాత్రం ఈ జైసింహా కథ, కథనాలు ఇరిటేషన్‌తో కూడిన నవ్వులు తెప్పిస్తాయనడంలో సందేహం లేదు. టెక్నికల్‌గా కూడా సినిమా చాలా ఓల్డ్ స్టైల్‌లో ఉండడం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరుస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటే ఫర్వాలేదనిపిస్తుంది. గత బాలయ్య సినిమాల స్టైల్‌లోనే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నప్పటికీ నయనతార మాత్రమే కాస్త బెటర్ అనిపిస్తుంది. ఇక జైసింహాగా కనిపించడానికి బాలయ్య కష్టపడాల్సింది ఏమీ లేకుండాపోయింది. ఆయనే నటించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా సినిమాల యాక్టింగ్‌ని మరోసారి ఈ సినిమాలో చూపించాడు అంతే. అయితే ఆయా సినిమాల్లో ఉన్న స్థాయి కథ, కథనాలు, సీన్స్ లేకపోవడంతో బాలయ్య ప్రయత్నం పూర్తిగా నిరూపయోగమైంది.

మొత్తానికి ప్రభుత్వాల ఆమ్యామ్యా వ్యవహారాలతో ……..బోలెడన్ని రాయితీలు, ప్యాకేజ్‌లు, హోదాలతో కలెక్షన్స్ కొల్లగొడదామనుకుని వచ్చిన అజ్ఙాతవాసి, జైసింహా సినిమాలను తెలుగు ప్రేక్షకులు గట్టిగా తిప్పికొట్టడం గమనార్హం. కలెక్షన్స్ కొల్లగొట్టాలన్న వ్యూహాలను రచించడానికి, ప్రభుత్వాలతో కుమ్మక్కు అయి ప్రేక్షకులను మాయ చేయడడానికి కష్టపడిన స్థాయిలో కాస్త కంటెంట్‌పైన, క్వాలిటీ సినిమాలు అందించడంపైన కూడా కష్టపడి ఉంటే బెటర్‌గా ఉండేదని తెలుగు సినిమా ప్రేక్షకులు టీవీగొట్టాల సొక్షిగా చెప్తుండడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -