Sunday, May 19, 2024
- Advertisement -

‘హ్యాపీ వెడ్డింగ్’ మూవీ రివ్యూ

- Advertisement -

మెగాడాటర్ నీహారిక ‘ఒక మనసు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమా నిరాశ పరచడంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని ‘హ్యాపీ వెడ్డింగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆమె అనుకున్న విజయాన్ని అందించిందో లేదో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ:  అక్షర(నిహారిక), ఆనంద్(సుమంత్ అశ్విన్) ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఒకరినొకరు అర్ధం చేసుకొని పెళ్లికి రెడీ అవుతారు. వారి కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి అంగీకరిస్తారు. అక్షర.. ఆనంద్ కు ముందు విజయ్(రాజా) అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ కొన్ని కారణాల వలన వారికి బ్రేకప్ అవుతుంది. ఆ విషయం ఆనంద్ కి కూడా తెలుసు. ఆనంద్ చాలా పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తి. అందరినీ ప్రేమించడం, జాగ్రత్తగా చూసుకోవడం చేస్తుంటాడు. కానీ అక్షర అలా కాదు.. తనది చాలా కన్ఫ్యూజన్ మైండ్. ఏ నిర్ణయాలు తొందరగా తీసుకోలేదు.. ఒకవేళ తీసుకున్నా మాట మీద నిలబడుతుందని చెప్పలేం.

అయితే కొద్దిరోజుల్లో పెళ్లి అనగా తన తప్పు తెలుసుకొని అక్షరకు సారీ చెప్పడానికి వస్తాడు విజయ్. తనకు పెళ్లి అనే విషయం అక్షర చెప్పగా అప్ సెట్ అవుతాడు. ఆమెకు దగ్గరవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇదే సమయంలో అక్షరకి ఆనంద్ తనను లెక్క చేయడంలేదని, ఇంపార్టన్స్ ఇవ్వడం తగ్గించాడని ఫీల్ అవుతుంది. ఓ పక్క పెళ్లి పనులన్నీ జరుగుతుంటే తనకు మాత్రం ఈ పెళ్లి కరెక్ట్ కాదనిపిస్తుందని ఆనంద్ కు చెప్పేస్తుంది. ఈ విషయంపై ఆనంద్ ఎలా రియాక్ట్ అయ్యాడు..? అక్షర తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందా..? ఆనంద్, విజయ్ లలో ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటుంది..? అనేదే మిగిలిన సినిమా.

విశ్లేషణ:  ఈ జెనరేషన్ అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు లక్ష్మణ్ ఈ కథను సిద్ధం చేసుకున్నాడు. అయితే ఈ కథతో ముందుగా వెబ్ సిరీస్ చేయాలనుకున్నారు కానీ క్వాలిటీ బాగా రావడంతో యువి క్రియేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి సినిమాగా రిలీజ్ చేశారు. అయితే అలా చేసి ఓ పెద్ద తప్పు చేశారని సినిమా చూశాక కచ్చితంగా అనిపిస్తుంది. రెండు గంటల సినిమాగా చేసి ఆడియన్స్ సహనానికి పెద్ద పరీక్ష పెట్టారు. హీరో, హీరోయిన్ పెళ్లికి రెడీ అవుతారు… తన కన్ఫ్యూజన్ మైండ్ తో హీరోయిన్ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలనుకోవడం, ఆమె మనసు మార్చి హీరో పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నం చేయడం.. ఈ అంశాలతో సినిమా మొత్తం నడుస్తుంది. ఒక ప్రేమ జంట. వారి మధ్య గొడవలు, రెండు కుటుంబాలు ఇలా తెరపై ఎంతమంది కనిపిస్తున్నా.. సరైన ఎమోషన్ ను పండించలేకపోయారు.

సాంకేతిక వ‌ర్గ ప‌నితీరు :అతి తక్కువ బడ్జెట్ లో సినిమాను సింపుల్ గా పూర్తి చేసేశారు. సినిమాటోగ్రఫీ, పాటలు అన్నీ కూడా కథకు తగ్గట్లుగా ఉన్నాయి. ఫిదా సినిమాకు పని చేసిన శక్తికాంత్ కార్తిక్ ఈ సినిమాలో ఒక్క పాట కూడా గుర్తుండిపోయేలా చేయలేకపోయాడు. కథలో బలం, బలమైన సన్నివేశాలు లేనప్పుడు పాటలు మాత్రం బాగుండాలని మనం కూడా ఆశించలేం. మేకింగ్ పరంగా అతడి మార్క్ ఎక్కడా కనిపించదు. రెగ్యులర్ సినిమాల మాదిరి అనిపిస్తుంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి తీసిన ఈ సినిమా వారికి కనెక్ట్ అవ్వడం కష్టమే.

బోట‌మ్ లైన్ :మ‌రోసారి నిరాశ పరిచిన నిహారిక.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -