Monday, May 20, 2024
- Advertisement -

నువ్వు తోపురా మూవీ రివ్యూ

- Advertisement -

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం సుధాకర్ కోమాకుల నటించిన చిత్రం నువ్వు తోపురా. ఈ సినిమా ద్వారా హరినాథ్ బాబు బీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఎన్నారై నిర్మాతలు జేమ్స్ కొమ్ము, శ్రీధర్ దడ్వాయి ఎమోషనల్ ప్రేమకథను తెరకెక్కించారు. యునైటెడ్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ సాధారణ యువకుడి అమెరికాలో గ్రీన్ కార్డు సంపాదించానికి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనే కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకొన్నదని తెలుసుకోవాలంటే నువ్వు తోపురా కథేంటో తెలుసుకోవాల్సిందే.

సరూర్ నగర్‌కు చెందిన సూరి (సుధాకర్ కోమాకుల) బాధ్యతలు, బంధాలు తెలియని యువకుడు. బీటెక్ పూర్తి చేయకుండా స్నేహితులతో సరదాగా తిరుగుతుండటాడు. తల్లి, చెల్లి అంటే ఇష్టం ఉండదు. చాలా మెకానికల్‌గా ఉంటడే సూరి రమ్య (నిత్యాశెట్టి)తో లవ్‌లో పడుతాడు. కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోతారు. సూరితో బ్రేకప్ తర్వాత రమ్య పై చదువుల కోసం యూఎస్ వెళ్తుంది. ఆ తర్వాత కల్చరల్ ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం రావడంతో సూరి అమెరికాకు వెళ్తాడు. ఆ తర్వాత రమ్యను కలుసుకొన్నాడా? తన తల్లి, చెల్లిపై ఎలా ప్రేమను పెంచుకొన్నాడు? యూఎస్‌లో కలిసిన వరుణ్ సందేశ్‌తో జర్నీ ఎలా సాగింది. చివరకు సూరి గ్రీన్ కార్డ్ హెల్డర్ ఎలా అయ్యాడు అనే ప్రశ్నలకు జవాబు నువ్వుతోపురా కథ.

నువ్వు తోపురా కథ తొలిభాగంలో మాస్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. రెండో భాగంలో బాధ్యతలు, బంధాల మధ్య నలిగిపోయే యువకుడి జర్నీ ముందుకు సాగుతుంది. సుధాకర్ కోమాకుల సూరి పాత్రలో ఒదిగిపోయాడు. కొన్ని ఎమోషనల్‌ సీన్లలో మెప్పించాడు. హీరోయిన్ నిత్యాశెట్టి అనుభవం ఉన్న హీరోయిన్‌లా నటించింది. తనకు లభించిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకొన్నది. డైలాగ్ డెలివరీ, నటనల పరిణతి కనిపించింది. వరుణ్ సందేశ్. చాలా రోజుల తర్వాత డిఫరెంట్ పాత్రలో కనిపించాడు. నటనపరంగా మంచి మార్కులు కొట్టేస్తాడు. సూరి మదర్‌గా సింధూరపువ్వు హీరోయిన్ నిరోషా నటించింది. తల్లి పాత్రలో ఒదిగిపోయింది. తల్లి, చెల్లెలు, సామాజిక అంశాలు ఫీల్‌గుడ్‌గా మారుతాయి. వరుణ్ సందేశ్, ఇసాబెల్లా, రమ్య క్యారెక్టర్లు ఇచ్చే ఝలక్‌లు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. దర్శకుడు హరినాథ్ అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కించాడు. రకరకాల క్యారెక్టర్లను బాగా హ్యాండిల్ చేశాడు. కథ, కథనాలపై మరింత జాగ్రత్త పడాల్సి ఉండాల్సింది.

నువ్వుతోపురా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ సినిమాటోగ్రఫి. అమెరికాలో అందమైన లోకేషన్లను కెమెరాలో బంధించి తీరుకు హ్యాట్యాఫ్. సెకండాఫ్‌లో సినిమా ఓ పెయింటింగ్‌లా అనిపిస్తుంది. అందుకు వెంకట్ దిలిప్ చుండూరు, ప్రకాశ్ వెలాయుధన్‌ ప్రతిభ కారణం. ఎడిటింగ్ పనితీరు బాగాలేకపోవడం వల్ల నిడివి పెరిగిపోయింది. సినిమాకు డైలాగ్స్ ప్రధాన ఆకర్షణ. అజ్లు మహంకాళి రాసిన డైలాగ్స్ బ్రహ్మండంగా పేలాయి. కొన్నిసార్లు హృదయానికి హత్తుకొంటాయి. బీ, సీ సెంటర్లలో ఆడితే కమర్షియల్‌గా మంచి హిట్టు కొట్టే అవకాశాలు ఉన్నాయి. సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లే ప్రమోషన్‌పైనే సినిమా విజయం ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

నటీనటులు: సుధాకర్ కోమాకుల, వరుణ్ సందేశ్, నిత్యాశెట్టి, నిరోషా, జబర్దస్త్ రాకేష్, మహేష్ విట్టా, రవివర్మ, దువ్వాసి మోహన్
దర్శకత్వం: హరినాథ్ బాబు బీ
సినిమాటోగ్రఫి: వెంకట్ దిలిప్ చుండూరు, ప్రకాశ్ వెలాయుధన్‌
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్: ఉద్దవ్
నిర్మాతలు: జేమ్స్ కొమ్ము, శ్రీధర్ దడ్వాయి
బాన్యర్: యునైటెడ్ ఫిలింస్
రిలీజ్: 2019-05-03

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -