Saturday, May 4, 2024
- Advertisement -

కృష్ణార్జున యుధ్ధం కథ…… ట్విస్ట్స్, క్యారెక్టరైజేషన్స్ ఏంటంటే?

- Advertisement -

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి హిట్ సినమాలను ఇచ్చిన మేర్లపాక గాంధీ రామ్ చరణ్‌తో సినిమా చేయడం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూశాడు. చరణ్ చుట్టూ ఆరునెలలు తిరిగాడు. అయితే స్టోరీ లైన్‌తో చరణ్ ఇంప్రస్ అయినప్పటికీ మొత్తం కథతో మాత్రం మెప్పించలేకపోయాడు. అయితే అదే కథతో నానీ మెప్పించాడు. అదే కృష్ణార్జున యుద్ధం సినిమా. అసలు ఈ కథలో నానీని అంతగా మెప్పించిన అంశాలు ఏంటంటే?

ఓ పల్లెటూర్లో ఉండే కృష్ణవి అన్నీ కృష్ణుడి వేషాలే. ప్రతి అమ్మాయికీ లైన్ వేస్తాడు……..కానీ ఎవ్వరూ పడరు. కానీ విదేశాల్లో ఉండే రాక్ స్టార్ అర్జున్ మాత్రం పూర్తి రివర్స్. ఏ అమ్మాయిని అయినా చిటికెలో పడేస్తాడు. అలాంటి ఈ ఇద్దరూ కూడా చెరో అమ్మాయితో లవ్‌లో పడిపోతారు. ఒక పనిమీద అర్జున్ లవర్ ఇండియాకు వస్తుంది. కిడ్నాప్ అవుతుంది. అదే టైంలో కృష్ణుడి లవర్ కిడ్నాప్ అవుతుంది. ఆ ఇద్దరినీ వెతుక్కుంటూ అర్జున్, కృష్ణుడులు ఇద్దరూ కూడా హైడ్రాబ్యాడ్ వస్తారు. అక్కడ ఇద్దరూ కలుస్తారు. ఇదే ఇంటర్వెల్.

ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి హీరోయిన్స్‌ని కిడ్నాప్ చేసినవాడితో ఎలా ఫైట్ చేశారు? అసలు ఈ కిడ్నాప్ చేసిన వాడు ఎవడు? ఫైనల్‌గా యుద్ధంలో ఎవరు గెలిచారు అన్నది కథ. ఈ కథ పాయింట్ నచ్చినప్పటికీ కథనం మాత్రం చరణ్‌కి నచ్చలేదు. అయితే నానీకి మాత్రం వెంటనే నచ్చేసింది. రామ్ చరణ్‌, నానీలలో ఎవరి జడ్జ్‌మెంట్ కరెక్టో……..యుద్ధం సినిమా ఫలితం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ వెయిట్ చెయ్యాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -