Sunday, May 19, 2024
- Advertisement -

అల్లరి నరేష్ సినిమాల స్థాయి కంటేంట్…… అయితేనేం హైప్ మాత్రం బ్రహ్మాండం…… అజ్ఙాతవాసి టీజర్…. జెన్యూన్ రివ్యూ

- Advertisement -

పబ్లిసిటీ అద్భుతంగా ఉంటే కలెక్షన్స్ ఏ స్థాయిలో కొల్లగొట్టొచ్చో బాహుబలి సినిమా నిరూపించింది. నిజానికి కథ, కథనాల పరంగా ఆ సినిమా యావరేజ్ స్థాయిలోనే ఉంటుంది. అయితేనేం పబ్లిసిటీ మాత్రం అద్భుతంగా చేసేశారు. లోపాలన్నీ కనపడకుండా అద్భుతమైన గ్రాఫిక్స్, ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, తెలుగువారి ఆత్మగౌరవం అంటూ పెద్ద పెద్ద పదాలతో వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళ గొంతు వినపడకుండా చేశారు. ఇక ఆ పబ్లిసిటీ మాయలో పడిపోయిన మూఢాభిమానులు బాహుబలిని విమర్శించినవాళ్ళపై బూతుల వర్షం కురిపించారు. ఇక ఇప్పుడు అజ్ఙాతవాసి కూడా అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నట్టుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా ఉన్నాడు కాబట్టి విమర్శకులను టార్గెట్ చేయడం ఇంకా ఈజీ. పవన్‌ని వ్యతిరేకించే పార్టీల వాళ్ళే విమర్శలు చేస్తున్నారు అని దబాయించొచ్చు.

అయితే అజ్ఙాతవాసి టీజర్ చూస్తూ ఉంటే అందులో ఉన్న గొప్పదనం ఏంటంటే కంటెంట్‌లో మాత్రం ఏమీ కనిపించలేదు. కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టారు కాబట్టి విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. ఫొటోగ్రఫీ అదిరిపోయింది. ఇక సినిమా అంతా కూడా కనీసం పది దేశాల్లో షూటింగ్ జరుపుకుని ఉంటుందని తెలుస్తోంది. అత్తారింటికి దారేది సిినిమాలో కూడా కోటీశ్వరుల కుటుంబ వారసుడి కథగా అన్నీ కూడా కోట్లాది రూపాయల ప్రాపర్జీసే కనిపించాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కూడా సేం టు సేం. కోటీశ్వరుడి వారసుడే కాబట్టి స్క్రీన్‌పైన అంతా గ్రాండియర్ కనిపించింది. ఇక పవన్ కళ్యాణ్ బ్రాండెడ్ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా అదిరిపోయాయి. ఇక పవన్ కళ్యాణ్‌ని బ్యాక్ నుంచి, పక్క నుంచి, చీకట్లోనూ చూపిస్తూ…..ఊరించి ఊరించి రివీల్ చేయడం కూడా ఫ్యాన్స్‌కి బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఆ తర్వాత హీరోయిన్స్‌తో హగ్‌లు, ముద్దుల వ్యవహారం కూడా కొంతమందికి బాగానే నచ్చొచ్చు. ఇక పవన్ అటూ ఇటూ కాని వాడిగా తన గత సినిమాల్లో ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చినట్టుగానే ఈ సినిమాలో కూడా అవే ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం…..ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కి రావురమేష్ కామెంట్స్ మరీ సి గ్రేడ్ స్థాయిలో డైలాగ్స్‌లా ఉన్నాయి. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ చీర కట్టుకుని ఉన్న పోస్టర్స్ వేస్తే త్రివిక్రమ్‌ని తిట్టిపోశారు పవన్ ఫ్యాన్స్. మరి మరోసారి అలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఎందుకు అవసరమయ్యాయో తెలియదు. కానీ దానిని కామెడీ అనుకోవాలంటే కష్టమే.

ఇక టీజర్‌లో కథకు సంబంధించిన ఒక్క సీన్, డైలాగ్ చూపించే ధైర్యం కూడా త్రివిక్రమ్‌కి లేకుండా పోయింది. ఆ విషయం పరిశీలిస్తేనే ఈ సినిమా కథ ఎంత రొటీన్ వ్యవహారమో ఇట్టే అర్థమైపోతోంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ కూడా టీజర్‌లో లేకుండా పోయింది. ఉన్న డైలాగ్స్ మరీ యావరేజ్‌గా కూడా లేవు. టీజర్‌లో ఉన్న కంటెంట్ అంతా కూడా అల్లరి నరేష్ సినిమాల స్థాయిలో ఉంది. కాకపోతే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఉండడం, కోట్లాది రూపాయల ఖర్చు కనిపించడంతో భారీ సినిమా అన్న కలర్ వస్తోంది. కానీ కథ, కథనం, డైలాగ్స్ విషయంలో మాత్రం త్రివిక్రమ్ స్థాయిలో కాకపోయినా కనీసం పవన్ కళ్యాణ్ సినిమాల స్థాయిలో కూడా లేకపోవడం గమనార్హం. అయితేనేం పబ్లిసిటీ మాత్రం ఓ స్థాయిలో చేసి పడేస్తున్నారు. అజ్ఙాతవాసి మేనియా అంటూ ఊదరగొట్టేస్తున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ కూడా యూట్యూబ్ హిట్స్, లైక్స్ కోసం డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. ఈ కష్టం అంతా కూడా కాస్త కథ, కథనాల విషయంలో పడి ఉంటే బాగుండేదన్నది సాధారణ ప్రేక్షకుల అభిప్రాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -